వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Vaccine registration: 18 ప్లస్..ఈ సాయంత్రం నుంచే: యాప్స్, వెబ్‌సైట్ ద్వారా మాత్రమే

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం మూడోదశ ఆరంభం కాబోతోంది. వచ్చనెల 1వ తేదీ నుంచి దీనికి దేశవ్యాప్తంగా మూడో విడత టీకాల కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టనుంది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ బుధవారం సాయంత్రం 4 గంటలకు ఆరంభమౌతుంది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవడానికి అర్హులు. తమ పేరు, ఇతర వివరాలను నమోదు చేయించుకున్న వారికి మాత్రమే వ్యాక్సిన్ వేస్తారు. ఏపీ సహా పలు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత నెలకొని ఉన్న పరిస్థితుల్లో ఆయా చోట్ల నిర్దేశిత గడువులోగా టీకాల కార్యక్రమం ప్రారంభమౌతుందా? లేదా? అనేది అనుమానాలను రేకెత్తిస్తోంది.

Recommended Video

COVID-19 Vaccine Registration Process On CoWin For 18 Years And Above || Oneindia Telugu

వ్యాక్సిన్ వేయించుకోవడానికి అర్హులైన ప్రతి ఒక్కరూ ముందుగా తమ పేర్లను నమోదు చేయించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న http://cowin.gov.in వెబ్‌సైట్‌తో మరో రెండు సౌకర్యాలను అమల్లోకి తీసుకొచ్చింది. ఆరోగ్యసేతు, ఉమంగ్ యాప్‌ల ద్వారా కూడా అర్హులు తమ పేర్లు, ఇతర వివరాలను నమోదు చేయించుకునే వెసలుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది.

Registration for 18 plus to begin on cowin, Aarogya Setu and UMANG App at 4 PM

తాము నివసిస్తోన్న ప్రదేశానికి సమీపంలో ఉండే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల వివరాలను తెలుసుకోవచ్చు. టైమ్ స్లాట్ తీసుకోవడం ద్వారా అందులో నిర్దేశించిన సమయానికి ఆసుపత్రి లేదా ప్రాథమిక ఆరోగ్యం కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ రెండో విడత డోసును ఎప్పుడు తీసుకోవాలనేది కూడా తెలుసుకోవచ్చు.

కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌తో పాటు కరోనా వ్యాక్సిన్ కొరత నెలకొని ఉంటోంది. దీన్ని అధిగమించడానికి ప్రభుత్వం తక్షణ చర్యలను తీసుకుంది. చాలా రాష్ట్రాలు వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొంటున్నాయి. ఏపీ, కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో టీకాల కొరత నెలకొని ఉంది.

Registration for 18 plus to begin on cowin, Aarogya Setu and UMANG App at 4 PM

ఈ పరిస్థితుల్లో మే 1వ తేదీ నుంచి 18 సంవత్సరాలు నిండిన వారికి వ్యాక్సినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడం వివాదాలకు దారి తీస్తోంది. చాలినంత వ్యాక్సిన్ అందుబాటులో లేకప్పుడు కేంద్రం ఆదేశాలను ఎలా పాటించగలమనే ప్రశ్న ఉత్పన్నమౌతోంది. ఇంకా మూడు రోజుల సమయం ఉన్నందున.. కొరతను అధిగమించడానికి చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ హామీ ఇచ్చారు.

English summary
Registration for 18 plus to begin on cowin, Aarogya Setu and UMANG App at 4 PM on 28th April. Appointments at State Govt centers and private centers depending on how many vaccination centers ready on 1st May: Aarogya Setu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X