జియో ఫినిషింగ్ టచ్.. ‘ప్రైమ్’ గడువు మరో 15 రోజులు, రూ.303తో మరో మూడు నెలలు ఉచితం
రిలయన్స్ జియో ప్రైమ్ మెంబర్ షిప్ ఆఫర్ ను కంపెనీ ఏప్రిల్ 15 వరకు పొడిగించింది. అంతేకాదు, ఇప్పటికే రూ.303తో రీఛార్జ్ చేయించుకున్న వారికి కూడా సర్ ప్రైజ్ ఆఫర్ ప్రకటించింది.
ముంబై: రిలయన్స్ జియో వినియోగదారులకు మరో శుభవార్త. నేటితో జియో ప్రైమ్ మెంబర్ షిప్ ముగుస్తున్న నేపథ్యంలో చివరి క్షణంలో ఈ ఆఫర్ ను కంపెనీ మరో 15 రోజులపాటు పొడిగించింది.
వినియోగదారుల నుంచి వస్తున్న విశేష ఆదరణే దీనికి కారణమని రిలయన్స్ జియో ప్రకటించింది. రూ.99తో జియో ప్రైమ్ మెంబర్ షిప్ గడువు మార్చి 31తో ముగియనుంది. అయితీ దీనిని తాజాగా ఏప్రిల్ 15 వరకు పొడిగించారు.

ఇప్పటి వరకు 7 కోట్లకు పైగా వినియోగదారులు ప్రైమ్ మెంబర్ షిప్ కు మారినట్లు సంస్థ వెల్లడించింది. అంతేకాదు, వినియోగదారులకు జియో మరో బంపర్ ఆఫర్ ను ప్రకటించింది.
ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకుని ఇప్పటికే రూ.303తో రీఛార్జి చేయించుకున్న వినియోగదారులకు 'సమ్మర్ సర్ ప్రైజ్'కింద ఒక నెలకు బదులుగా మూడు నెలల ఉచిత డేటా, వాయిస్ సేవలను అందించనున్నట్లు సంస్థ వెల్లడించింది.












Click it and Unblock the Notifications