బీహార్ లో యూఎస్ తీర్పు రిపీట్ ..ఇక్కడ నమస్తే ట్రంప్ అంటే అక్కడ బైబై ట్రంప్ అన్నారు : శివసేన
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బీహార్లో అమెరికా తరహాలో నాయకత్వ మార్పు పునరావృతం కానుందని శివసేన సోమవారం తెలిపింది. బీహార్లో ఎన్డీఏ ఓడిపోతుందని, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓటమిని ప్రస్తావిస్తూ అటువంటి ఫలితమే బీహార్ లోనూ వస్తుందంటూ శివసేన పేర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలో డొనాల్డ్ ట్రంప్ భారతదేశాన్ని సందర్శించినప్పుడు కరోనావైరస్ మహమ్మారి మధ్య 'నమస్తే ట్రంప్' కార్యక్రమంపై శివసేన తన మౌత్ పీస్ 'సామానా'లో కేంద్ర ప్రభుత్వంపై దాడి చేసింది.ఇప్పుడు ట్రంప్ ఓటమితో హర్షం వ్యక్తం చేస్తుంది .

ఎన్డీఏ కూటమి బీహార్ ఎన్నికల్లో స్పష్టంగా ఓడిపోతుంది శివసేన
అమెరికాలో ఇప్పటికే అధికారం మారిపోయిందని అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ ఎంత హడావిడి చేసిన, డెమోక్రాట్ జోబైడెన్ విజయం సాధించారని శివసేన పేర్కొంది. అదే సమయంలో నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి బీహార్ ఎన్నికల్లో స్పష్టంగా ఓడిపోతుంది అంటూ శివసేన పేర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలో ట్రంప్ భారత దేశాన్ని సందర్శించిన సమయంలో నమస్తే ట్రంప్ కార్యక్రమంపై కేంద్ర ప్రభుత్వం పై విరుచుకుపడిన శివసేన , భారతదేశంలో నమస్తే ట్రంప్ అంటే అమెరికన్ ప్రజలు మాత్రం బై బై ట్రంప్ అన్నారంటూ పేర్కొంది.

యువనేత తేజశ్వి యాదవ్ ముందు నిలబడలేరన్న శివసేన
ట్రంప్ ను గెలిపించిన ప్రజలు ఈసారి తమ తమ తప్పును సరిదిద్దుకున్నారని శివసేన తెలిపింది. అదేవిధంగా, మోడీ, నితీష్ కుమార్ వంటి నాయకులు ఈసారి యువనేత తేజశ్వి యాదవ్ ముందు నిలబడలేరని శివసేన పేర్కొంది . భారతీయ జనతా పార్టీ మరియు దానితో పొత్తు పెట్టుకున్న పార్టీలపై మండిపడింది. బీహార్ ఎన్నికలను ప్రజలు తమ చేతుల్లోకి తీసుకున్నారని ప్రధాని మోడీ, నితీష్ కుమార్ ముందు వారు మోకరిల్లలేదని శివసేన అభిప్రాయం వ్యక్తం చేసింది.

జంగిల్ రాజా అయినా పర్వాలేదు .. ముందు మీరు వెళ్ళండి
బీహార్ ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ కూటమి తేజస్వి యాదవ్ ను జంగిల్ రాజా అంటూ ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో జంగిల్ రాజ్ వ్యాఖ్యలను గురించి శివసేన మాట్లాడుతూ, బీహార్ లోని ప్రజలు ముందు మీరు వెళ్ళండి, మేము జంగిల్ రాజు వచ్చినా భరించగలము అని చెప్పారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . బీహార్ మరియు యునైటెడ్ స్టేట్స్ ప్రజలను ప్రశంసించారు శివసేన నేతలు. దేశంలోనూ రాష్ట్రంలోనూ మనం తప్ప ప్రత్యామ్నాయం లేదని భ్రమ పడుతున్న వారి భ్రమలను తొలగించడం కోసం ప్రజలు చేయాలి పనిచేయాల్సి ఉంది అంటూ పేర్కొంది శివసేన. డోనాల్డ్ ట్రంప్ కమల హ్యారీస్ విజయాన్ని అంగీకరించలేదని, అలాంటి వ్యక్తికి మోడీ మద్దతు ఇచ్చారంటూ శివసేన ప్రధాని నరేంద్ర మోడీ పై విరుచుకుపడింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications