మోడీపై ప్రశ్నకు జర్నలిస్టుకు స్వామీజీ చెంపదెబ్బ
జబల్పూర్: నరేంద్ర మోడీ ప్రధాని అయ్యే అవకాశాలపై ప్రశ్న వేసినందుకు స్వామి స్వరూపానంద సరస్వతి ఓ జర్నలిస్టు చెంప చెల్లుమనిపించారు. పైగా తన చర్యను సమర్థించుకున్నారు. ఆ విషయాన్ని గొప్పగా చెప్పుకున్నారు కూడా. మోడీపై ప్రశ్నలు వేస్తున్న సమయంలో జర్నలిస్టును స్వామీజి కొట్టిన దృశ్యం కెమెరాలకు చిక్కింది.
జర్నలిస్టును కొట్టినందుకు ఆ 90 ఏళ్ల స్వామీజి కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు. నరేంద్ర మోడీ గురించి పదే పదే అడుగుతుండడంతో తాను జర్నలిస్టును కొట్టానని, ప్రజల ప్రశంసల ద్వారానో, విమర్శల ద్వారానో నరేంద్ర మోడీ పేరు నోళ్లలో నానేలా వ్యవహరిస్తున్నారని స్వామీజీ అన్నారు.

రాజకీయ ప్రశ్నలకు తాను సమాధానాలు చెప్పబోనని ఆ స్వామీజీ చెప్పారు. అయినా వినకుండా అతను ప్రశ్నలు సంధిస్తుండడంతో స్వామీజీ కోపం కట్టలు తెంచుకుంది. స్వరూపానంద సరస్వతి ద్వారక శంకరచార్యగా ఉన్నారు. మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడాన్ని ఆయన తప్పు పట్టారు కూడా.
ఈ సంఘటనపై కార్యక్రమ నిర్వాహకులు సర్దిచెప్పే ప్రయత్నాలు చేశారు. రాజకీయాల గురించి మాట్లాడేందుకు స్వామీజి ఇష్టపడరని వారన్నారు.












Click it and Unblock the Notifications