వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Republic Day 2023: దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇండియా గేట్ ‌ వద్ద జాతీయ జెండాను ఎగుర వేస్తారు.

|
Google Oneindia TeluguNews

ఏటా జనవరి 26వ తేదీన దేశం గణతంత్ర దినోత్సవంను జరుపుకుంటుంది.1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. రవి అస్తమించని బ్రిటీషు సామ్రాజ్యం నుంచి భారత దేశం విముక్తి పొంది సొంత రాజ్యాంగాన్ని అమలు చేసుకుంది. 1947లో భారత్ స్వాతంత్ర్యం పొందినప్పటికీ సొంతంగా రాజ్యాంగం అంటూ లేదు.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాజ్యాంగ నిర్మాణంలో భాగంగా ఒక కమిటీ ఏర్పాటైంది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బీఆర్ అంబేడ్కర్, బీఎన్ రావ్‌తో పాటు మరికొందరు సభ్యులుగా ఈ కమిటీలో ఉన్నారు. నవంబర్ 26,1949లో రాజ్యాంగం రూపొందించగా 1950 జనవరి 26వ తేదీన అమల్లోకి వచ్చింది.

రాష్ట్రపతి అధికారిక నివాసం రాష్ట్రపతి భవన్‌లో వేడుకలు ప్రారంభం అవుతాయి. ఇండియా గేట్ వద్ద రాష్ట్రపతి ముర్ము తొలిసారిగా జాతీయ జెండాను ఎగుర వేస్తారు.జాతీయ గీతం ఆలపించాక పరేడ్ జరుగుతుంది. పరేడ్‌లో త్రివిధ దళాలు పాల్గొంటాయి.ఇక రిపబ్లిక్‌డే వేడుకలను తిలకించేందుకు ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకోవాలి.ఇక రిపబ్లిక్ డేకు సంబంధించి ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఢిల్లీ వేడుకల విషయాలు మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం

Republic day 2023 highlights and live updates in telugu:President Murmu to unfurl the national flag at India gate

Newest First Oldest First
11:27 AM, 26 Jan

గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో మకర సంక్రాంతి సందర్భంగా రైతుల పండుగ అయిన 'ప్రభల తీర్థం'ను వర్ణించే ఆంధ్రప్రదేశ్ శకటం అందరిని ఆకట్టుకుంది.
11:05 AM, 26 Jan

గాంధీ భవన్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.
10:59 AM, 26 Jan

75 ఆర్మర్డ్ రెజిమెంట్ ప్రధాన యుద్ధ ట్యాంక్ అర్జున్ కర్తవ్య మార్గంలో కవాతు చేస్తుంది. దీనికి కెప్టెన్ అమంజీత్ సింగ్ నాయకత్వం వహిస్తున్నాడు.
10:58 AM, 26 Jan

కర్తవ్య పథ్ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
10:54 AM, 26 Jan

61వ అశ్విక దళం, ప్రపంచంలోని ఏకైక చురుకైన గుర్రపు అశ్వికదళ రెజిమెంట్, కర్తవ్య మార్గంలో కవాతు చేస్తోంది.
10:43 AM, 26 Jan

రిపబ్లిక్ పరేడ్ 2023 ఈజిప్టు సాయుధ దళాల బృందంతో ప్రారంభమైంది.
10:42 AM, 26 Jan

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఈజిప్ట్ ప్రెసిడెంట్ ఎల్-సిసితో కలిసి కర్తవ్య మార్గం వద్దకు వచ్చినప్పుడు అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము స్వదేశీ 105-మిమీ ఇండియన్ ఫీల్డ్ గన్స్ (IFG)తో 21-గన్ సెల్యూట్‌తో సత్కరించారు.
10:29 AM, 26 Jan

74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు రాష్ట్రపతి భవన్ లో ఘనంగా జరుగుతోన్నాయి.
10:23 AM, 26 Jan

ణతంత్ర దినోత్సవ వేడుకలు ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియంలో గురువారం ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు.
10:20 AM, 26 Jan

74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు ప్రధాని మోదీ నివాళులర్పించారు.
10:19 AM, 26 Jan

ప్రగతిభవన్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు జరిగాయి. సీఎం కేసీఆర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. అంబేడ్కర్‌ చిత్రపటాలకు నివాళులర్పించారు.
10:07 AM, 26 Jan

రిపబ్లిక్ డే పరేడ్‌లో మేడ్-ఇన్-ఇండియా వెపన్ సిస్టమ్‌లు ప్రదర్శించారు. ఇందులో 'మేడ్ ఇన్ ఇండియా' 105 మిమీ ఇండియన్ ఫీల్డ్ గన్‌ల ద్వారా 21 గన్ సెల్యూట్ వంటి భారతదేశ స్వదేశీకరణ శక్తిని ప్రదర్శించే మందుగుండు సామగ్రి ఉన్నాయి.
9:57 AM, 26 Jan

గురువారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
9:56 AM, 26 Jan

భువనేశ్వర్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పరేడ్‌కు ఒడిశా గవర్నర్ ప్రొఫెసర్ గణేశి లాల్ తీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీఎం నవీన్ పట్నాయక్ సమక్షంలో పాల్గొన్నారు.
9:54 AM, 26 Jan

జేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ జాతీయ జెండాను ఎగురవేశారు.
9:51 AM, 26 Jan

హైకోర్టు వద్ద ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
9:40 AM, 26 Jan

శాసనసభలో జాతీయ పతాకాన్ని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు.
9:32 AM, 26 Jan

శాసమండలిలో జాతీయ జెండా ఆవిష్కరించిన ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
9:23 AM, 26 Jan

తెలంగాణ భవన్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు నిర్వహించారు. బీఆర్ఎస్ సెక్రెటరీ జనరల్ కేకే జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, బీఆర్​ఎస్ నేతలు పాల్గొన్నారు.
9:00 AM, 26 Jan

ఈ రోజు ఆధునిక భారతదేశం గొప్ప సంస్కృతిని, ఆకట్టుకునే విజయాలను గౌరవించే క్షణం. భారతదేశం పట్ల తమకున్న భాగస్వామ్య ప్రేమ, దాని భవిష్యత్తుపై విశ్వాసాన్ని పంచుకోవడానికి భారతీయ వారసత్వం ఉన్న వారందరికీ ఇది ఒక అవకాశం... రిపబ్లిక్ డే జరుపుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు: ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్
8:59 AM, 26 Jan

గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జి హెచ్ ఎం సి ప్రధాన కార్యాలయం లో జాతీయ పథకాన్ని ఆవిష్కరించిన కమిషనర్ డి యస్ లోకేష్ కుమార్.
8:51 AM, 26 Jan

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో గణతంత్ర వేడుకలు
8:49 AM, 26 Jan

బీఆర్కే భవన్‌లో జాతీయ పతాకాన్ని సీఎస్ శాంతికుమారి ఆవిష్కరించారు.
8:48 AM, 26 Jan

74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి గురువారం చెన్నైలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ గీతాలాపన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారత వైమానిక దళం (ఐఏఎఫ్) హెలికాప్టర్ల ద్వారా పూలవర్షం కురిపించాయి.
8:47 AM, 26 Jan

మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్య అమృత్ మహోత్సవం సందర్భంగా జరుపుకోవడం ఈసారి ప్రత్యేకత. దేశంలోని గొప్ప స్వాతంత్ర్య సమరయోధుల కలలను సాకారం చేసేందుకు ఐక్యంగా ముందుకు సాగాలని కోరుకుందాం: నరేంద్ర మోడీ
8:22 AM, 26 Jan

జైపూర్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్.
7:56 AM, 26 Jan

రాజ్ భవన్ లో సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, రచయత చంద్రబోస్‌ను గవర్నర్ తమిళి సైసన్మానించారు. బాలలత, ఆకుల శ్రీజను కూడా సన్మానించారు. కాగా ఇటీవలే RRR చిత్రంలోని నాటు నాటు పాట ఆస్కార్ కు నామినేట్ అయింది. ఈ పాటకు కీరవాణి సంగీతం అందించగా.. చంద్రబాస్ పాట రాశారు. ఈ పాటను రాహుల సిప్లిగంజ్ పాడారు.
7:48 AM, 26 Jan

దేశంలోని అన్ని నగరాలకు హైదరాబాద్‌తో కనెక్టవిటీ ఉందని గవర్నర్‌ తమిళి సై అన్నారు. ఇటీవలే సికింద్రాబాద్‌కు ప్రధాని వందేభారత్‌ రైలు కేటాయించారని గుర్తించారు. గవర్నర్‌రాష్ట్రాభివృద్ధికి అవసరమైన సహకారాన్ని రాజ్‌భవన్‌ అందిస్తోందని స్పష్టం చేశారు.‌తెలంగాణలో రోజుకు 22 ఆత్మహత్యలు జరుగుతున్నాయిని.. ప్రజలు ఆత్మస్థైర్యంతో ఉండాలని విజ్ఞప్ చేశారు. కొంత మందికి తాను నచ్చకపోవచ్చు.. అయినా తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తానని తమిళి సై చెప్పారు. 07:3
7:44 AM, 26 Jan

రాజ్ భవన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు

హైదరాబాద్ రాజ్‌భవన్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు నిర్వహించారు. గవర్నర్ తమిళి సై జాతీయ పతాకాన్ని ఎగరేశారు. గణతంత్ర వేడుకల్లో సీఎస్‌ శాంతకుమారి, డీజీపీ అంజనీకుమార్‌, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
7:38 PM, 25 Jan

మహిళా సాధికారత, లింగ సమానత్వం నినాదాలు ఇకపై ఉండవు. ఎందుకంటే ఇటీవలి కాలంలో గొప్ప పురోగతి వైపు అడుగులు వేస్తున్నాం. రేపటి భారతదేశాన్ని తీర్చిదిద్దడంలో మహిళలే ఎక్కువ కృషి చేస్తారనడంలో సందేహం లేదు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
READ MORE

English summary
74th Republic day celebrations live updates and highlights in telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X