ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్ డ్రెస్ రిహార్సల్: ట్రాఫిక్ ఆంక్షలు, గాలిలోనూ
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో గణతంత్ర వేడుకల కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రిపబ్లిక్ డే పరేడ్ కోసం సోమవారం పూర్తి డ్రెస్ రిహార్సల్‌ను సజావుగా నిర్వహించేందుకు.. ఆయా మార్గాల్లో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలను విధించారు. ఈ రిహార్సల్ ఉదయం 10.30 గంటలకు విజయ్ చౌక్ నుంచి ప్రారంభమయ్యాయి.
ఆ తర్వాత కర్తవ్య మార్గం, సీ-హెక్సాగన్, నేతాజా సుభాష్ చంద్రబోస్ రౌండ్ అబౌట్ విగ్రహం, తిలక్ మార్గ్, బహదర్ షా జాఫర్ మార్గ్, నేతాజీ సుభాష్ మార్గ్ మీదుగా ఎర్రకోట వద్ద రిహార్సల్ ముగుస్తుంది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం కవాతు ముగిసే వరకు విజయ్ చౌక్ నుంచి ఇండియా గేట్ వరకు కర్తవ్యమార్గంలో ఎలాంటి ట్రాఫిక్ కదలికలు అనుమతించడం లేదు.
ఆదివారం రాత్రి 11 గంటల నుంచి కవాతు ముగిసే వరకు రఫీ మార్గ్, జన్‌పథ్, మాన్ సింగ్ రోడ్‌లోని కర్తవ్య మార్గంలో ట్రాఫిక్ ను అనుమతించరు. సోమవారం ఉదయం 9.15 గంటల నుంచి కవాతు తిలక్ మార్గ్ దాటే వరకు సి-హెక్సాగాన్-ఇండియా గేట్ మూసివేస్తారు. తిలక్ మార్గ్, బహదూర్ షా జఫర్ మార్గ్, సుభాష్ మార్గ్‌లలో ఉదయం 10.30 గంటల నుంచి రెండు వైపులా ట్రాఫిక్ అనుమతించరు. పరేడ్ కదలికను బట్టి మాత్రమే క్రాస్-ట్రాఫిక్ అనుమతిస్తారని స్పష్టం చేశారు.

ప్రయాణికులు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కవాతు మార్గంలో వెళ్లకుండా చూడాలని సూచించారు.
డ్రెస్ రిహార్సల్ వేడుక సందర్భంగా అన్ని స్టేషన్లలో మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి. అయితే, ట్రాఫిక్ సూచనల ప్రకారం.. కేంద్రీయ సచివాలయ, ఉద్యోగ్ భవన్ స్టేషన్లలో బోర్డింగ్, డీబోర్డింగ్ ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అనుమతించరు.
ఉత్తర ఢిల్లీ నుంచి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లేదా పాత ఢిల్లీ రైల్వే స్టేషన్‌కు వెళ్లడానికి ఇంకా ఎటువంటి పరిమితి లేనప్పటికీ.. సాధ్యమయ్యే ఆలస్యాన్ని నివారించడానికి ప్రజలు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
కాగా, పార్క్ స్ట్రీట్/ఉద్యన్ మార్గ్, అరమ్ బాగ్ రోడ్ (పహర్‌గంజ్), కమ్లా మార్కెట్ రౌండ్‌అబౌట్, ఢిల్లీ సెక్రటేరియట్ (ఐజీ స్టేడియం), ప్రగతి మైదాన్ (భైరాన్ రోడ్), హనుమాన్ మందిర్ (యమునా బజార్), మోరీ గేట్, ఐఎస్‌బిటి, కాశ్మీర్ గేట్, ఐఎస్‌బీటీ సరాయ్ కాలే ఖాన్, టిస్ హజారీ కోర్ట్ వద్ద సిటీ బస్సుల రాకపోకలను తగ్గించనున్నారు.
ఘజియాబాద్ నుంచి శివాజీ స్టేడియానికి వెళ్లే బస్సులు ఎన్‌హెచ్-24, రింగ్ రోడ్డు మీదుగా భైరాన్ రోడ్‌లో నిలిచిపోతాయి. ఎన్‌హెచ్-24 నుంచి వచ్చే వారు రోడ్ నెం 56లో కుడి మలుపు తీసుకొని ఐఎస్‌బీటీ ఆనంద్ విహార్ వద్ద ముగుస్తుందని ట్రాఫిక్ సూచనలు స్పష్టం చేశాయి.
ఘజియాబాద్ నుంచి వచ్చే బస్సులను మోహన్ నగర్ వద్ద వజీరాబాద్ వంతెనపై భోప్రా చుంగి వైపు మళ్లిస్తారు. అంతేగాక, పారాగ్లైడర్లు, పారామోటర్లు, హ్యాంగ్ గ్లైడర్లు, మానవరహిత వైమానిక వాహనాలు, మానవరహిత విమాన వ్యవస్థలు, మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్, రిమోట్‌గా పైలట్ చేసే ఎయిర్‌క్రాఫ్ట్, హాట్ ఎయిర్ బెలూన్‌లు, చిన్న సైజు పవర్డ్ ఎయిర్‌క్రాఫ్ట్, క్వాడ్‌కాప్టర్లు లేదా జాతీయ విమానాల నుంచి పారా దూకడం, ఎగరడం వంటివాటిని నిషేధించారు.
ఫిబ్రవరి 15 వరకు ఢిల్లీ రాజధాని ప్రాంతంలో ఈ నిబంధనలు అమలులో ఉండనున్నాయి. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, కూడళ్ల వద్ద మోహరించిన సిబ్బంది సూచనలను పాటించాలని ట్రాఫిక్ అడ్వైజరీ స్పష్టం చేసింది.
-
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications