వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సరస్వతీ ఆలయ నిర్మాణానికి ముస్లిం టీచర్ విరాళం

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: ఓ రిటైర్డ్ ముస్లిం ఉపాధ్యాయుడు పరమత సహనాన్ని చాటుకున్నారు. తాను పని చేసిన పాఠశాలలో విద్యార్థుల కోసం సరస్వతీ మాత ఆలయ నిర్మాణానికి భారీగా విరాళం ఇచ్చారు. పలువురికి ఆదర్శంగా నిలిచే ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

మరిడా గ్రామంలోని పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేసి పదవీ విరమణ చేసిన అబ్దుల్ ఓరా.. విద్యార్థుల కోసం ఆ పాఠశాలలోనే సరస్వతీ ఆలయాన్ని నిర్మించేందుకు అవసరమైన మొత్తంలో సగానికిపైగా విరాళంగా అందించారు.

గ్రామస్తులు ఇచ్చిన మరికొంత విరాళాలతో ఐదేళ్లపాటు శ్రమించి మందిర నిర్మాణం పూర్తి చేయించారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. తాను మొదట ఉపాధ్యాయుడినని ఆ తర్వాతే మరేదైనానని చెప్పారు.

Retired Muslim teacher helps build Saraswati temple in school

‘మూడు దశాబ్దాలుగా ఈ పాఠశాలలో పని చేశాను. విద్యార్థులే నాకు స్ఫూర్తి. వారికి సరస్వతీ దేవి స్ఫూర్తి. అందుకే ఈ మందిర నిర్మాణానికి పెద్ద మొత్తంలో విరాళం ఇవ్వాలనుకున్నా. గ్రామంలో కూడా మరో ఆలయాన్ని నిర్మించాలన్న కోరిక నా మనసులో ఉంది' అని ఓరా తెలిపారు.

కాగా, పాఠశాలలో పాఠాలు చెప్పడంతో జీవిత పాఠాలు నేర్పే ఆ గురువు అంటే గ్రామంలో అందరికీ గౌరవమే. తనను అందరూ గౌరవించే ఈ గ్రామానికి ఏదో ఒక మంచి చేయాలని తనకు ఉంటుందని ఓరా తెలిపారు.

English summary
In a rare gesture, this teacher, Abdul Vora, constructed goddess Saraswati temple within the village school premises for the children to be inspired. "I am a teacher first and everything else later.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X