Revenge: భార్య మీద అనుమానం, పగతో రగిలిపోయాడు, కొడుకు మీద ప్రతీకారం, చంపేసి సెల్ఫీ డ్రామాలు !
సూరత్: గుజరీ వ్యాపారం చేస్తున్న యువకుడు కొన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. వ్యాపారంలో బాగా డబ్బు సంపాధిస్తున్న అతను మొదట భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. అయితే రానురాను భార్య మీద భర్తకు అనుమానం మొదలైయ్యింది. నేను వ్యాపారం చెయ్యడానికి బయటకు వెలుతుంటే తన భార్య ఎంజాయ్ చేస్తోందని భర్తకు అనుమానం పెరిగిపోయింది. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. పెద్దలు పంచాయితీలు చేసినా ఫలితం లేకుండా పోయింది. భర్త మీద రగిలిపోయిన భార్య కొడుకును పిలుచుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను తరువాత ఇంటికి పిలుచుకుని రావాలని ఆమె భర్త అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే భార్య మాత్రం నీతో చస్తే ఉండనని తేల్చి చెప్పింది. భార్య మీద పగతో రగిలిపోతున్న భర్త ఎలాగైనా ఆమె మీద పగ తీర్చుకోవాలని ప్రయత్నించడంతో అదిసాధ్యం కాలేదు. చివరికి పక్కాప్లాన్ తో దీపావళి పండుగకు టపాకాయలు తీసిస్తానని కొడుకుని ఇంటి నుంచి బయటకు పిలుచుకుని వచ్చి అతని నదిలో తోసి జలసమాధి చేశాడు. కొడుకును చంపేసిన కిరాతకుడు సెల్ఫీ తీసుకుంటుంటే తన కొడుకు ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడని నాటకాలు ఆడాటం కలకలం రేపింది.

14 ఏళ్ల క్రితం ?
మహారాష్ట్రలో సూరత్ లో సయిద్ షేక్ (33) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. గుజరీ వ్యాపారం చేస్తున్న సయిద్ షేక్ కొన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. వ్యాపారంలో బాగా డబ్బు సంపాధిస్తున్న అతను మొదట భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. సయిద్ షేక్ కు 12 ఏళ్ల కొడుకు ఉన్నాడు. వివాహం జరిగిన 6 సంవత్సరాల తరువాత సయిద్ దంపతుల మధ్య గొడవలు మొదలైనాయి.

భార్య మీద అనుమానం పెరిగిపోయింది
రానురాను సయిద్ షేక్ కు అతని భార్య మీద భర్తకు అనుమానం మొదలైయ్యింది. నేను వ్యాపారం చెయ్యడానికి బయటకు వెలుతుంటే తన భార్య ఎవరితోనో ఎంజాయ్ చేస్తోందని సయిద్ షేక్ ఎక్కువ అనుమానం పెరిగిపోయింది. ఇదే విషయంలో సయిద్ దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. పెద్దలు పంచాయితీలు చేసినా సయిద్ షేక్ మారకపోవడంతో ఫలితం లేకుండా పోయింది.

భర్తతో విడిపోయిన భార్య
ఐదు సంవత్సరాల క్రితం సయిద్ షేక్ అతని భార్యను పట్టుకుని చితకబాదడంతో గొడవ పెద్దది అయ్యింది. ఆ సమయంలో జరిగిన పెద్దల పంచాయితీలో సయిద్ రెచ్చిపోయాడు. తరువాత సయిద్ షేక్ పెద్దల ముందు అతని భార్యను మరోసారి చితకబాదేశాడు. ఐదు సంవత్సరాల క్రితమే భర్త సయిద్ మీద రగిలిపోయిన అతని భార్య కొడుకును పిలుచుకుని మహారాష్ట్రలోని బుల్దానాలోని ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.

భార్యను పిలుచుకుని రావాలని స్కెచ్
పుట్టింటికి వెళ్లిపోయిన తన భార్యను ఇంటికి పిలుచుకుని రావాలని సయిద్ షేక్ అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే భార్య మాత్రం నీతో చస్తే ఉండనని సయిద్ షేక్ కు తేల్చి చెప్పింది. భార్య మీద పగతో రగిలిపోతున్న సయిద్ షేక్ ఆమె మీద ఎలాగైనా ఆమె మీద పగ తీర్చుకోవాలని ప్రయత్నించడంతో అది ఇంత వరకు సాధ్యం కాలేదు.

భార్య మీద పగతో కొడుకును చంపేసిన కిరాతకుడు
చివరికి భార్యను చంపడానికి సాధ్యం కాకపోవడంతో కొడుకు జాకీర్ (12)ను చంపేయాలని సయిద్ స్కెచ్ వేశాడు. పక్కాప్లాన్ తో సయిద్ దీపావళి పండుగకు టపాకాయలు తీసిస్తానని అతని కొడుకు జాకీర్ ను ఇంటి నుంచి బయటకు పిలుచుకుని వచ్చాడు. తరువాత కొడుకు జాకీర్ ను వివేకానంద బ్రిడ్జ్ మీదకు పిలుచుకుని వెళ్లి తాపీ నదిలో తోసి జలసమాధి చేశాడు. కొడుకు జాకీర్ ను చంపేసిన కిరాతకుడు సయిద్ సెల్ఫీ తీసుకుంటుంటే తన కొడుకు జాకీర్ ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడని పోలీసుల ముందు నాటకాలు ఆడాడు.

భర్త మీద కేసు పెట్టిన భార్య
అయితే సయిద్ చెబుతున్న మాటల మీద నమ్మకం లేకపోవడంతో పోలీసులకు అనుమానం మొదలైయ్యింది. నా భర్త సయిద్ నా కొడుకు జాకీర్ ను చంపేసి ఉంటాడని అతని భార్య కేసు పెట్టింది. పోలీసులు సయిద్ ను అదుపులోకి తీసుకుని నాలుగు పీకడంతో అతను జరిగిన విసయం మొత్తం చెప్పాడు. భార్య మీద పగతో కన్న కొడుకు జాకీర్ ను అతని తండ్రి సయిద్ హత్య చేశాడని వెలుగు చూడటం కలకలం రేపింది.












Click it and Unblock the Notifications