Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wife Revenge: భర్తకు బంపర్ ఆఫర్, బెడ్ రూమ్ ఫోటోలు వైరల్, భార్య దెబ్బతో ఫేమస్, ఇది దెబ్బ !

సూరత్/ చెన్నై/హైదరాబాద్: భార్య అక్రమ సంబంధం సాగిస్తుందనో, అడిగినంత కట్నం తీసుకురాలేదని కోపంతో, తన భార్య తనను సక్రమంగా చూసుకోవడం లేదనో తదితర సమస్యల కారణంగా భర్తలు భార్యలను వేధింపులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. కొన్ని చోట్ల ప్రియురాలి మీద కోపంతో, ఆమెకు వేరే ప్రియుడు ఉన్నాడని అనుమానంతో అమ్మాయిలు, ఆంటీల అశ్లీల వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేసి వాళ్ల మీద పగ తీర్చుకున్న విషయాలు మనం అనేక సందర్బాల్లో చూస్తున్నాము, వింటున్నాము. అయితే ఇప్పుడు భర్త మీద పగతో భార్య రగిలిపోయింది. భర్త బెడ్ రూమ్ లో నగ్నంగా రాసలీలలు సాగిస్తున్న సమయంలో, అతను బాత్ రూమ్ లో స్నానం చేస్తున్న సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలను అతని భార్య సోషల్ మీడియాలో పోస్టు చేసింది. భార్య దెబ్బతో భర్త బతుకు ఇప్పుడు ప్రైవేట్ బస్ స్టాండ్ అయిపోయింది. నా భార్య నుంచి తనను మీరే రక్షించాలని భర్త పోలీసులను ఆశ్రయించడం కలకలం రేపింది.

 గ్రాండ్ గా వ్యాపారవేత్త పెళ్లి

గ్రాండ్ గా వ్యాపారవేత్త పెళ్లి

గుజరాత్ లోని సూరత్ లో నివాసం ఉంటున్న రంజిత్ (పేరు మార్చడం జరిగింది) బట్టల వ్యాపారం చేస్తున్నాడు. రంజిత్ బట్టల వ్యాపారం చాలా జోరుగా చేస్తున్నాడు. మంచి వ్యాపారవేత్త అయిన రంజిత్ కు 29 ఏళ్ల ప్రియా (పేరు మార్చడం జరిగింది) అనే యువతితో నాలుగు సంవత్సరాల క్రితం గ్రాండ్ గా పెళ్లి జరిగింది.

 బెడ్ రూమ్ లో అసలు కథ మొదలైయ్యింది

బెడ్ రూమ్ లో అసలు కథ మొదలైయ్యింది

పెళ్లి జరిగిన తరువాత దాదాపు రెండు సంవత్సరాల క్రితం వరకు రంజిత్, ప్రియాల కాపురం ఓ రకంగా సాగింది. పెళ్లి జరిగిన తరువాత రంజిత్, ప్రియా దంపతులు సంవత్సరం పాటు వాళ్ల బెడ్ రూమ్ లో సవ్యంగా కాపురం చేశారు. బెడ్ రూమ్ లో భార్యభర్తలు ఎలా ఉంటారో రంజిత్, ప్రియా కూడా ఎలాంటి సిగ్గు లేకుండా హ్యాపీగానే ఎంజాయ్ చేశారు. అక్కడే అసలు కథ మొదలైయ్యింది.

 విడాకులు తీసుకున్న దంపతులు

విడాకులు తీసుకున్న దంపతులు

పెళ్లి జరిగిన 18 నెలల తరువాత రంజిత్, ప్రియాల కాపురంలో చిచ్చు మొదలైయ్యింది. నాతో నా భర్త సక్రమంగా కాపురం చెయ్యడం లేదని భార్య ప్రియా ఆరోపిస్తే, నా భార్యకు ఎవరితో అక్రమ సంబంధం ఉందని భర్త ఆరోపించడం మొదలుపెట్టాడు. వీళ్ల గొడవలు తారాస్థాయికి చేరడంతో రెండు సంవత్సరాల క్రితం రంజిత్, ప్రియా విడాకులు తీసుకున్నారు.

 భర్త మీద పగ పెంచుకున్న భార్య

భర్త మీద పగ పెంచుకున్న భార్య

విడాకులు తీసుకున్న బట్టల వ్యాపారి రంజిత్, ప్రియా వేరువేరుగా కాపురం ఉంటూ ఎవరి పాటికి వాళ్లు జీవిస్తున్నారు. అయితే తన జీవితం నాశనం కావడానికి తన మాజీ భర్త రంజిత్ కారణం అయ్యాడని ప్రియా పగ పెంచుకునింది. అయితే రంజిత్ మాత్రం అతని వ్యాపారం అతను చేసుకుంటూ మాజీ భార్య ప్రియా గురించి పట్టించుకోవడం మానేశాడు. ఓ రోజు రంజిత్ కు ఓ షాకింగ్ విషయం తెలిసింది.

 భార్య దెబ్బతో సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయిన భర్త

భార్య దెబ్బతో సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయిన భర్త

ఇన్ స్టాగ్రామ్ లో, ఫేస్ బుక్ తో పాటు సోషల్ మీడియాలో ని అనేక ఫ్లాట్ ఫామ్స్ లో బట్టల వ్యాపారి రంజిత్ వ్యక్తిగత ఫోటోలు, అతని అశ్లీల ఫోటోలు, వీడియోలు దర్శనం ఇచ్చాయి. రంజిత్ తో వ్యాపారం చేస్తున్న కొందరు వ్యాపారులు సోషల్ మీడియాలో రంజిత్ అశ్లీల ఫోటోలు, వీడియోలు చూసి అతనికి సమాచారం ఇచ్చారు. సోషల్ మీడియాలో తన అశ్లీల ఫోటోలు చూసిన రంజిత్ మైండ్ బ్లాక్ అయ్యి అతని దిమ్మెతిరిగిపోయింది.

 అన్నీ నకిలీ అకౌంట్స్

అన్నీ నకిలీ అకౌంట్స్

సోషల్ మీడియాలో తన పేరుతో నకిలీ అకౌంట్లు ప్రారంభించి తన వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు పోస్టు చేస్తున్నారని, వాటికి నాకు ఎలాంటి సంబంధం లేదని, తన జీవితం నాశనం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ మే 22వ తేదీన రంజిత్ సూరత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు, తన అశ్లీల ఫోటోలు వీడియోలు తన పాత బెడ్ రూమ్ లో రెండు సంత్సరాల క్రితం తీసినవి అని రంజిత్ పసిగట్టాడు. మాజీ భార్య ప్రియా మీద రంజిత్ కు డౌట్ వచ్చి అదే విషయం పోలీసులకు చెప్పాడు. కరోనా కాలంలో, లాక్ డౌన్ సమయంలో ఇలాంటి కేసులు ఏందిరా బాబూ అంటూ పోలీసులు తలలు పట్టుకున్నారు.

 వీడి కథ అప్పుడే ఏమైపోయింది

వీడి కథ అప్పుడే ఏమైపోయింది

సూరత్ సైబర్ క్రైమ్ పోలీసులు రంజిత్ మాజీ భార్య ప్రియాను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. రెండు సంవత్సరాల క్రితం రంజిత్ బెడ్ రూమ్ లో ఏకాంతంగా ఉన్న సమయంలో తానే రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీశానని, తరువాత కొన్ని ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అతని పేరుతో నకిలీ అకౌంట్లు ప్రారంభించి తానే ఆ ఫోటోలు అప్ లోడ్ చేశానని పోలీసుల విచారణలో అతని మాజీ భార్య ప్రియా అంగీకరించింది. తన మాజీ భర్త రంజిత్ కథ ఇంత త్వరగా క్లోజ్ అవుతుందని అనుకోలేదని, ముందుముందు అతనికి సినిమా చూపించాలని ఆశపడ్డానని భార్య ప్రియా కోపంగా చెప్పడంతో పోలీసులు బిత్తరపోయారు.

Recommended Video

    Irfan Pathan పై ట్రోలింగ్‌.. Wife's Blurred Pic నేను భర్తను, మాస్టర్ ను కాదు || Oneindia Telugu
     ప్రతీకారం తీర్చుకున్న భార్య మీద కేసులు

    ప్రతీకారం తీర్చుకున్న భార్య మీద కేసులు

    వ్యాపారవేత్త రంజిత్ వ్యక్తిగత (పర్సనల్) ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేసిన అతని మాజీ భార్య ప్రియా మీద పోలీసులు ఐటీ శాఖ నియమాలు ఉల్లంఘించారని, వ్యాపారవేత్తకు అపకీర్తి కలింగించారని, అతను పరువు బజారులో పడటానికి కారణం అయ్యిందని, పరువు నష్టం దావా కేసులు నమోదు చేశామని పోలీసు అధికారులు అంటున్నారు. మొత్తం మీద మాజీ భార్య దెబ్బతో వ్యాపారవేత్త బతకు బస్ స్టాండ్ కావడం గుజరాత్ లో హాట్ టాపిక్ అయ్యింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+