RG Kar Rape Case: కోల్‌కత్తా వైద్యురాలి హత్యాచారం కేసులో కీలక తీర్పు!
కోల్‌కత్తా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో పీజీ వైద్యురాలి హత్యాచారం కేసు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. అత్యంత అమానుషమైన ఈ నేరంలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో, ఆసుపత్రిలో ఏం జరిగింది అన్న అంశం, మెడికల్ మాఫియా దీని వెనుక ఉంది అన్న అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఇక ఈ కేసులో కీలక తీర్పు వెలువరించింది కలకత్తా ప్రత్యేక కోర్టు.
ఆర్జీకర్ మెడికల్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసు
గత సంవత్సరం ఆగస్టు 9వ తేదీన రాత్రి ఆర్జీకర్ మెడికల్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ పైన జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ప్రతీ ఒక్కరూ స్పందించేలా చేసింది. ఆర్జీ కార్ మెడికల్ హాస్పిటల్స్ సెమినార్ హాల్ రూమ్ లో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా నిరసనలకు కూడా దారి తీసింది.

50 మంది సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు
ఇక నేడు ఈ కేసుకు సంబంధించి కలకత్తాలోని ప్రత్యేక న్యాయస్థానం సిల్ధా సివిల్ అండ్ క్రిమినల్ కోర్టు తీర్పును వెలువరించింది. గతేడాది నవంబర్ 12 నుండి ఈ కేసులో విచారణ సాగిస్తున్న సిల్దాకోర్టు ఈ నెల 9 వ తేదీన తుది విచారణ పూర్తి చేసింది. మొత్తం ఈ కేసులో 50 మంది సాక్ష్యాలను పరిశీలించింది.
దోషిగా తేలింది అతనే
మొత్తం రెండు నెలల పాటు విచారణ జరిపి ఎట్టకేలకు కేసులో ఉన్న ఆధారాలతో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ని న్యాయస్థానం దోషిగా తేల్చింది. ఈ నెల 20న సంజయ్ కు న్యాయస్థానం శిక్ష ఖరారు చేయనుంది. ఇక న్యాయస్థానం సంజయ్ రాయ్ కు వేసే శిక్ష పైన ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతుంది.
మెడికల్ మాఫియాపై చర్చకు కారణమైన ఆర్జీ కార్ వైద్యురాలి హత్యాచారం
అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ కేసు ను సిబిఐ అధికారులు లోతుగా దర్యాప్తు ేశారు. ఆర్జీకర్ ఆసుపత్రిలో యువ వైద్యురాలు అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోవడంతో ప్రారంభమైన ఈ కేసు ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని చిత్రీకరించే ప్రయత్నాలు చేసే దాకా వెళ్ళింది. మెడికల్ మాఫియాపై పెద్ద చర్చనే జరిగింది.
సంజయ్ రాయ్ శిక్షపై ఉత్కంఠ
ఈ కేసులో అరెస్టు అయిన నిందితుడు సంజయ్ రాయ్ ను హైకోర్టు ఆదేశాలతో సీబీఐ విచారించింది. నిందితుడికి పాలిగ్రాఫ్ టెస్ట్ చేసింది. మాీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ తో పాటు పలువురిని ప్రశ్నించింది సీబీఐ. ఈ కేసులో సీబీఐ నివేదిక ఇచ్చి నిందితుడికి మరణశిక్ష విధించాలని సిఫార్సు చేసింది. ఇక ఈ క్రమంలో సంజయ్ రాయ్ ని కోర్టు దోషిగా తేల్చిన నేపధ్యంలో కోర్టు త్వరలో అతనికి శిక్ష ఖరారు చేయనుంది. మరణ శిక్ష ఖాయమా అన్నది ఉత్కంఠకు కారణమైంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications