ఆర్జేడీ బిగ్ షాక్.. ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, నలుగురు మాజీలపై వేటు !!
బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల హడావిడి నెలకొంది. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్షాలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అయితే అనూహ్య నిర్ణయాలతో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఇప్పటికే ఎన్డీయే అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నందున బీజేపీ నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఆరుగురు నాయకులపై బీజేపీ వేటు వేసింది. బీజేపీ బహిష్కరించిన వారిలో ప్రస్తుత ఎమ్మెల్యే పవన్ యాదవ్ కూడా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నుండి టికెట్ లభించకపోవడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తరుణంలో ఈ డిసిషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రతిపక్ష ఆర్జేడీ పార్టీ సైతం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఆరోపణలతో 27 మంది నాయకులను బహిష్కరించింది. వీరిలో ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఈ బహిష్కరణ విషయాన్ని పార్టీ నేత మంగని లాల్ మండల్ వెల్లడించారు. బహిష్కరించబడిన నాయకులను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా సస్పెండ్ చేసినట్లు తెలిపారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

కాగా మహాగఠ్‌బంధన్ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నందున నేతలపై చర్య తీసుకున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. బహిష్కరణకు గురైన 27 మందిలో.. ఎమ్మెల్యేలు చోటే లాల్ రాయ్, మహ్మద్ కమ్రాన్‌తో పాటు నలుగురు మాజీ ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన పోటీ ఎన్డీయే (NDA) కూటమి, మహాగఠ్‌బంధన్ (RJD + Congress + Left) మధ్య నెలకొంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, బీజేపీతో కలసి పోటీకి సిద్ధమవుతుండగా.. మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ఆర్జేడీ తరఫున యువతకు చేరువ కావడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇక బిహార్‌లో వచ్చే నెల 6, 11 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. ఇప్పటికే ఎన్నికల కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాల సిద్ధతను పర్యవేక్షిస్తోంది. దాదాపు 12 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.












Click it and Unblock the Notifications