అన్నాడిఎంకె కార్యకర్తలు దినకరన్‌కు సహకరించాలి: శశికళ

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: ఆర్‌కె నగర్ ఉప ఎన్నికల్లో టీటీవి దినకరన్ విజయం సాధించడం పట్ల అన్నాడిఎంకె మాజీ ప్రధాన కార్యదర్శి వికె శశికళ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నికల్లో టీటీవి దినకరన్ 40వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అన్నాడిఎంకె అభ్యర్థి మధుసూదన్ రెండో స్థానంలో నిలిచారు. డిఎంకె అభ్యర్థి గణేష్ డిపాజిట్ కోల్పోయిన విషయం తెలిసిందే.

ఆర్‌.కె.నగర్: అన్నాడిఎంకెదే అధిపత్యం, కానీ, దినకరన్ విజయం

ఆస్తుల కేసులో బెంగుళూరు జైల్లో శశికళ ఉన్నారు. ఆర్ కె నగర్ ఉప ఎన్నికల్లో టీటీవి దినకరన్ విజయం సాధించారనే విషయం తెలిసిన వెంటనే శశికళ దినకరన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం పట్ల ఆమె హర్షం ప్రకటించారు. దినకరన్‌కు జైలు అధికారుల ద్వారా ఆమె శుభాకాంక్షలు తెలిపారు.

Rk Nagar result:Vk Sasikala greets TTV Dinakaran

అన్నాడీఎంకే కోట్లాది మంది కార్యకర్తలు దినకరన్‌కు సహాయసహకారాలు అందించాలని, దివంగత ముఖ్యమంత్రి జయలలిత రెండుసార్లు ఎమ్మెల్యేగా వ్యవహరించిన ఆర్‌కే నగర్‌ అభివృద్ధికి దినకరన్‌ కృషి చేయాలని శశికళ తన శుభాకాంక్షలను తెలిపారు. ఈ మేరకు శశికళ దినకరన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాశారు.

ఆర్‌కె నగర్ ఫలితాలు: తమిళనాడు రాజకీయాలపై ప్రభావం, ఎవరీ దినకరన్?

జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో వీడియోను ఎన్నికలకు రెండు రోజుల ముందు దినకరన్ ను శిబిరం విడుదల చేసింది.ఈ వీడియో ఎన్నికల్లో తీవ్ర ప్రభావాన్ని చూపిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former AIADMK general secretary Vk Sasikala greeted TTV Dinakaran after RK Nagar by poll results. Sasikala wrote a letter to Dinakaran on Sunday. She sent a letter to Dinakaran by jail officials.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి