రోడ్ టెర్రర్: మణిపూర్ మధ్యప్రదేశ్‌లలో ఘోర రోడ్డు ప్రమాదాలు..
ప్రమాదంలో 12మంది మృతి చెందగా, మరో 30 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.
భోపాల్: మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జబల్ పూర్ లోని నీచీ అనే గ్రామంలో మినీ ట్రక్కు బోల్తా కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో 12మంది మృతి చెందగా, మరో 30 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.
ప్రమాద ఘటన గురించి తెలియగానే పోలీసులు, సహాయక బృందాలు అక్కడకు చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. క్షతగాత్రులంతా రైతు కూలీలే అని సమాచారం. ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
మణిపూర్ లో మరో ఘోర రోడ్డు ప్రమాదం:

మణిపూర్ లోని సేనాపతి జిల్లాలో ఓ బస్సు లోయలో పడిపోయింది. ప్రమాదంలో 8మంది ప్రయాణికులు మరణించగా, మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. సోమవారం తెల్లవారుజామున 3గం.కు ఈ ఘటన చోటు చేసుకుంది. మణిపూర్ రాజధాని ఇంఫాల్ కు 90కిమీ దూరంలో.. మారం-మకాన్ మార్గం గుండా బస్సు ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదం సంభవించింది.
ప్రమాదంలో చాలామంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడటంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది. ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంపై మణిపూర్ సీఎం బిరెన్ సింగ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ప్రభుత్వం తరుపు నుంచి వీలైనంత సహాయక చర్యలను చేపడుతున్నట్లుగా వివరించారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications