"అజిత్ పవార్ విమాన ప్రమాదం పెద్ద కుట్ర.. సాక్ష్యం ఇదే.."

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణంపై ఎన్సీపీ (ఎస్పీ) నేత రోహిత్ పవార్ సంచలన ఆరోపణలు చేశారు. అజిత్ పవార్ విమాన ప్రమాదం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. ఈ ఘటనపై తక్షణమే అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు తాజాగా ముంబైలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రోహిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సమావేశంలో ఎన్సీపీ (ఎస్పీ) నేత రోహిత్ పవార్ మాట్లాడుతూ.. అజిత్ పవార్ ప్రయాణించిన విమాన ప్రమాదం కేవలం సాంకేతిక లోపం వల్ల జరిగింది కాదని.. అది ఒక ప్రణాళికాబద్ధమైన కుట్ర అని సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు కీలక విషయాలను బహిర్గతం చేశారు. అజిత్ పవార్ వాస్తవానికి జనవరి 27 రాత్రి కారులో పుణే వెళ్లాల్సి ఉందని.. కానీ ఓ నాయకుడి ఒత్తిడి వల్ల ప్రయాణం వాయిదా పడిందన్నారు. దాంతో మరుసటి రోజు ఉదయం విమానంలో వెళ్లాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

ఈ మేరకు ఘటన జరిగిన రోజు విమానాన్ని నడిపిన కెప్టెన్ సుమిత్ కపూర్ ట్రాక్ రికార్డ్‌ పైనా రోహిత్ పవార్ పలు ప్రశ్నలు సంధించారు. విమానాన్ని నడపాల్సిన రెగ్యులర్ పైలట్‌ లను కాదని.. గతంలో క్రమశిక్షణా చర్యలు ఎదుర్కొన్న కెప్టెన్ సుమిత్ కపూర్‌ ను చివరి నిమిషంలో ఎందుకు నియమించారని ప్రశ్నలు లేవనెత్తారు. గతంలో మద్యం సేవించినందుకు పైలట్ సుమిత్‌ ను మూడేళ్లు సస్పెండ్ చేశారని గుర్తు చేశారు.

RohitPawar Drops Bomb Massive Conspiracy Behind Ajit Pawar s Death Calls for Global Investigation

ఈ నేపథ్యంలో ఈ విమాన ప్రమాదంపై దర్యాప్తు చేయడానికి సీఐడీకి పూర్తి అధికారం ఉండదని.. అందువల్ల అమెరికాకు చెందిన NTSB లేదా బ్రిటన్‌ కు చెందిన AAIB వంటి అంతర్జాతీయ సంస్థల ద్వారా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక జనవరి 28, 2026న ముంబై నుండి బారామతి విమానం బారామతి విమానాశ్రయం సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌ తో పాటు పైలట్లు, భద్రతా సిబ్బంది సహా ఐదుగురు మరణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+