అరవింద్ కేజ్రీవాల్‌కు ఆరు రోజుల ఈడీ కస్టడీ
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఆరు రోజుల ఈడీ కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. దీంతో మార్చి 28 వరకు కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీలోకి తీసుకొని విచారించనుంది. లిక్కర్ పాలసీతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను గురువారం రాత్రి ఆయన అధికార నివాసంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత శుక్రవారం ఉదయం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. ఈడీ కస్టడీ పిటిషన్‌పై రెండున్నర గంటల పాటు సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. పది రోజులపాటు కేజ్రీవాల్‌ను కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది. అయితే, వాదనల అనంతరం కేజ్రీవాల్‌ను ఆరు రోజుల ఈడీ కస్టడీకి అనుమతిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

కాగా, కోర్టులో ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరవింద్ కేజ్రీవాల్ కీలక సూత్రధారి అని ఈడీ ఆరోపించింది. సౌత్ గ్రూప్ సంస్థకు, నిందితులకు మధ్య ఆయన మధ్యవర్తిగా వ్యవహరించారని పేర్కొంది. 'లిక్కర్ స్కాంలో అరవింద్ కేజ్రీవాల్ కింగ్‌పిన్. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలుకు సౌత్ గ్రూప్' సంస్థ నుంచి రూ.కోట్ల ముడుపులు అందుకున్నారు. పంజాబ్ ఎన్నికల కోసం ఆ సంస్థకు చెందిన కొందరు నిందితుల నుంచి రూ.100 కోట్లు డిమాండ్ చేశారు అని ఈడీ పేర్కొంది.
అంతేగాక, రూ. 45 కోట్లను గోవా ఎన్నికల కోసం వినియోగించారు. హోల్‌సేల్ వ్యాపారులకు 12 శాతం, రిటైల్ వ్యాపారులకు 185 శాతం వచ్చేలా పాలసీ రూపకల్పన జరిగింది దీని వల్ల 600 కోట్ల లాభాలు అర్జించారు అని ఈడీ తరఫు న్యాయవాదులు వాదించారు. ఆ తర్వాత కేజ్రీవాల్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది అభిషేక్ సింఘ్వీ సరిగ్గా ఎన్నికల ముందు అందరు ఆప్ నేతలు జైల్లో ఉన్నారన్నారు.
ఎన్నికల్లో ప్రత్యర్థులు లేకుండా గెలవాలని చూస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఇది ప్రజాస్వామ్యంపై ప్రభావం చూపిస్తుందన్నారు. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఈడీ వద్ద ఆధారాలుంటే కస్టడీ ఎందుకని సింఘ్వీ ప్రశ్నించారు. అప్రూవర్లుగా మారిన వారిని నమ్మాల్సిన అవసరం లేదని చెప్పారు.
#WATCH | Delhi CM Arvind Kejriwal in Rouse Avenue court after his ED remand hearing.
— ANI (@ANI) March 22, 2024
Chief Minister Arvind Kejriwal sent to ED custody till March 28 by court. pic.twitter.com/jCZ0stEbfv
కేసు విచారణలో భాగంగా ఈడీ చెప్పిన ముగ్గురు, నలుగురి పేర్లనే మళ్లీ మళ్లీ చెబుతోందన్నారు. అరెస్టు చేయగలిగే శక్తి ఉన్నంత మాత్రాన అరెస్టు చేయాల్సిన అవసరం ఉన్నట్లు కాదన్నారు. ఒక ముఖ్యమంత్రిని అరెస్టు చేయాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు. ఈ కేసును అన్ని కేసుల్లా చూడవద్దని, ఇందులో ప్రజాస్వామ్యానికి సంబంధించిన పెద్ద సమస్యలు ఉన్నాయని వివరించారు. వాదనలు విన్న తర్వాత కేజ్రీవాల్‌కు












Click it and Unblock the Notifications