రైల్వే లో రూట్ బ్రేక్ జర్నీ రూల్
సుదూర ప్రాంతానికి ప్రయాణం చేయాలంటే అందరినీ మొదటిగా ఆకర్షించేది రైలు. తక్కువ వ్యయంతో ఎక్కువ దూరాన్ని సురక్షితంగా చేర్చడంలో రైలును మించి ప్రయాణ సాధనం లేదనేది భారతీయుల నమ్మకం. రైలు ప్రయాణమంటేనే ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ప్రయాణానికి భారతీయ రైల్వే కొన్ని నియమ నిబంధనలను రూపొందించింది. చాలామందికి వీటిపై అవగాహన ఉండదు.

కొన్ని ప్రత్యేక కారణాలవల్ల సరైన సమయానికి రైలును అందుకోలేక ప్రయాణించలేనివారు ఎందరో ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో తర్వాత ఉండే రెండు స్టాప్స్ కు వెళ్లి రైలును పట్టుకునే సౌకర్యాన్ని అందజేస్తోంది. తద్వారా ప్రయాణికుల ప్రయాణాన్ని సౌకర్యవంతం చేసేందుకు రైల్వే ప్రయత్నిస్తోంది. అవసరమనుకుంటే ప్రయాణాన్ని రెండు విడుతలుగా కూడా చేయవచ్చు. టికెట్లను ముందుగానే కొనుగోలు చేసినప్పటికీ కొన్ని సందర్భాల్లో అకస్మాత్తుగా ప్రయాణానికి సంబంధించిన ప్లాన్ మారుతుంది. అటువంటి సందర్భంలో కొత్తగా మరో టికెట్ ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.

అప్పటికే కొనుగోలు చేసిన టికెట్ పై ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. కాకపోతే కోచ్ ను మార్చాల్సి ఉంటుంది. ప్రయాణాన్ని కంటిన్యూ చేయడానికి టీటీఈతో మాట్లాడాలి. తదుపరి టికెట్ ను అతను సిద్ధం చేసి ఇస్తాడు. ఆ రైలులు అందుకోలేకపోతే మరో 2 స్టేషన్ల తర్వాత అందుకోవచ్చు. అప్పటివరకు టీటీఈ ఆ సీటును ఎవరికీ కేటాయించరు. రూట్ బ్రేక్ జర్నీ రూల్ గురించి చాలామందికి అవగాహన ఉండదు. 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణంలో ఉంటే మధ్యలో విరామం తీసుకోవచ్చు. అదే ప్రయాణం వెయ్యి కిలోమీటర్లతై రెండు విరామాలు తీసుకోవచ్చు. ఎక్కిన తేదీ, దిగిన తేదీ నుంచి 2 రోజులు విరామం తీసుకోవచ్చు.












Click it and Unblock the Notifications