చంద్రుడిపై నడిచిన రోవర్ ప్రగ్యాన్: మేడిన్ ఇండియా అంటూ ఇస్రో ట్వీట్

హైదరాబాద్: చంద్రయాన్-3 ప్రయాణంపై తాజాగా మరో సమాచారం ఇచ్చింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO). చంద్రుడిపైకి ఇప్పటిదాకా ఏ దేశమూ అందుకోలేకపోయిన సంక్లిష్ట లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన ఇస్రో చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. చంద్రుడి దక్షిణ ధృవం వద్ద విక్రమ్ ల్యాండ్ అయిన దాదాపు నాలుగు గంటల తర్వాత దాని లోపలి నుంచి ప్రజ్ఞాన్(ప్రగ్యాన్) రోవర్ సాఫీగా బయటకు వచ్చింది.

ఈ నేపథ్యంలో ఇస్రో సోషల్ మీడియా వేదికగా స్పందించింది. 'చంద్రయాన్ 3 రోవర్ చంద్రుడి కోసం భారత్‌లో తయారైంది. అది ల్యాండర్ నుంచి సాఫీగా బయటకు వచ్చింది. దీంతో భారత్ చంద్రుడిపై నడిచింది' అంటూ ఇస్రో గురువారం ట్వీట్ చేసింది.

Rover Pragyan takes a walk on moon, Made in India, made for moon: ISRO

ల్యాండర్‌లో పంపించిన రోవర్ పేరు ప్రగ్యాన్. దీని బరువు 26 కిలోలు. ఆరు చక్రాల సాయంతో చంద్రుడి ఉపరితలంపై తిరుగుతూ 14 రోజులు పనిచేస్తుంది. ఇందులో రెండు పేలోడ్‌లు ఉన్నాయి. ప్రస్తుతం రోవర్ తన అధ్యయనం మొదలుపెట్టింది. అక్కడి ఫొటోలు, పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలియజేయనుంది.

'

కాగా, చంద్రుడిపైకి అనేక దేశాలు ప్రయోగాలు చేసినా.. మూడు మాత్రమే విజయవంతమయ్యాయి. ఇప్పుడు ఆ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. ఇంతకుముందు సోవియేట్ యూనియన్, అమెరికా, చైనాలు చంద్రుడిపై అడుగుపెట్టాయి. అయితే, ఆ మూడూ భూమికి కనిపించే వైపు చంద్రుడిపై అడుగుపెట్టగా.. మన చంద్రయాన్ మాత్రం ఇప్పటిదాకా మానవాళికి కనిపించని దక్షిణధృవాన్ని ముద్దాడింది.

నేడు విజయవంతమైన చంద్రయాన్-3కి అంతకుముందు నిర్వహించిన చంద్రయాన్-1, 2 ప్రయోగాలు ప్రేరకాలుగా నిలిచాయి. చంద్రయాన్-3 విజయవంతం కావడంతో ప్రపంచ దేశాలు భారత్‌పై ప్రశంసలు కురిపిస్తున్నాయి. చంద్రుడి దక్షిణ ధృవంపైకి రష్యా కూడా చంద్రయాన్-3 సమయంలో ప్రయోగించినప్పటికీ.. ఆ ప్రయోగం విఫలమైన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+