లోదుస్తుల తరహాలో స్కూల్ యూనిఫామా?: కేరళ స్కూల్‌పై వెల్లువెత్తుతున్న విమర్శలు..
స్కూల్ యూనిఫామ్‌పై కొజికోడ్‌కు చెందిన నౌషద్ తెక్కయిల్ అనే వ్యక్తి కేరళ బాలల హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. సదరు పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
తిరువనంతపురం: లోదుస్తులను తలపించే విద్యార్థుల యూనిఫామ్ కేరళలో వివాదాస్పదంగా మారింది. సెయింట్ అల్ఫోన్సా అనే ఓ పబ్లిక్ స్కూల్లో ఈ తరహా యూనిఫామ్ ను ప్రవేశపెట్టారు. మూడు నెలల క్రితం ఈ యూనిఫామ్ ను ప్రవేశపెట్టగా.. అక్కడి విద్యార్థినులంతా ఇదే యూనిఫామ్ వేసుకెళ్తున్నారు.
ఇటీవల జకారియా పాన్ కున్నమ్ అనే ఫోటోగ్రాఫర్ ఆ యూనిఫామ్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆడవాళ్ల లోదుస్తులను తలపించే విధంగా యూనిఫామ్ రూపొందించడమేంటని పలువురు మండిపడుతున్నారు. చదవుకునే పిల్లలకు ఇలాంటి అసభ్యకరమైన దుస్తులేంటి? అని స్కూల్ తీరును తప్పుపడుతున్నారు.

స్కూల్ యూనిఫామ్‌పై కొజికోడ్‌కు చెందిన నౌషద్ తెక్కయిల్ అనే వ్యక్తి కేరళ బాలల హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. సదరు పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. స్కూల్ యాజమాన్యం మాత్రం విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఎటువంటి ఫిర్యాదులు అందలేదని తెలిపింది. టీచర్-పేరెంట్ మీటింగ్ లో తొలుత దీనిపై చర్చించాకే నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది.
అంతేకాదు, సోషల్ మీడియాలో ఉన్న ఫోటోలు ఫోటోషాప్ ద్వారా మార్చారని, తమ స్కూల్ యూనిఫామ్ ఇలా ఉంటుందని మరో ఫోటో ఒకటి స్కూల్ యాజమాన్యం పోస్టు చేసింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications