rowdy youth murder chennai temple friends lady woman illegal affair tamil nadu police head రౌడీ యువకుడు హత్య చెన్నై ఆలయం లేడీ మహిళ అక్రమ సంబంధం తమిళనాడు పోలీసు తల
Rowdy: తల నరికి గుడి తలుపు ముందు పెట్టేశారు, ఎవరా ఫిగర్ ?, ఎలక్షన్ టైమ్ లో స్కెచ్ !
చెన్నై/తంజావూరు: తెల్లవారు జామున ప్రముఖ ఆలయం తలుపు ముందు ఓ యువకుడి తల కనపడింది. శుభమా అంటూ ఆలయం ముందు దేవుడిని ముక్కోవడానికి వెళ్లిన ప్రజలు యువకుడి తల చూసి పరుగు తీశారు. పోలీసులు విచారణలో ఆలయం ముందు ఉన్న తల రౌడీషీటర్ ది అని వెలుగు చూసింది. కేవలం 19 ఏళ్ల వయసులో పోలీస్ స్టేషన్లలో అనేక కేసులు నమోదు కావడంతో ఆ యువకుడు రౌడీషీటర్ జాబితాలోకి ఎక్కాడు. జైలు వెళ్లి వచ్చిన ఆ యువకుడిని ఓ ఫిగర్ సహాయంతో పక్కాప్లాన్ తో తల నరికి చంపేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
Illegal affair: కొడుకు ఫ్రెండ్ తో ఆంటీ మస్త్ మజా, అసలే పండ్లు, భర్తుకు తెలిసిపోయి !

19 ఏళ్లకే పోటుగాడు
తమిళనాడులోని తంజావూరులో రెడ్డిపాళ్యం శివగామి ప్రాంతంలో మణి (19) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. 19 ఏళ్ల వయసులోనే మణి క్రిమినల్ గా అవతారం ఎత్తాడు. రౌడియిజం, మామూళ్లు వసూలు చెయ్యడం. వివాహిత మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు.

పోలీస్ స్టేషన్లలో కేసులు
తంజావూరులోని అనేక పోలీస్ స్టేషన్లలో మణి మీద అనేక కేసులు నమోదైనాయి. రౌడీషీటర్ల జాబితాలో మణి పేరు ఎక్కింది. అనేక కేసుల్లో అరెస్టు అయిన మణి జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చాడు. మణి మీద అతని ప్రత్యర్థి వర్గానికి చెందిన వాళ్ల కన్నుపడింది. టైమ్ చూసి మణిని లేపేయాలని వేచి చూశారు.

తల అడ్డంగా నరికేసి నరబలి
తంజావూర్ మెడికల్ కాలేజ్ సమీపంలోని హోటల్ లో రాత్రి పీకలదాక మద్యం సేవించిన మణి భోజనం చెయ్యడానికి వెళ్లాడు. విషయం గుర్తించిన ప్రత్యర్థులు ఓ ఆంటీతో మణికి ఫోన్ చేయించి అతన్ని పక్కదోవ పట్టించారని తెలిసింది. తరువాత మణిని తంజావూరులోని రైల్వే ట్రాక్ సమీపంలోకి రప్పించారు. అక్కడే కాపుకాచిన ప్రత్యర్థులు మణిని నరికి నరబలి ఇచ్చేసి అతని తల మొండెం రెండుగా వేరు చేశారు.

ఆలయం ముందే తల
తంజావూరులోని ఆలయం తలుపు ముందు మణి తలపెట్టిన ప్రత్యర్థులు అక్కడి నుంచి పరారైనారు. వేకువ జామున దేవుడి గుడి ముందు వెలుతున్న స్థానికులు తలు గడప మీద యువకుడి తల చూసి కేకలు వేస్తూ పరుగు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా హత్యకు గురైయ్యింది రౌడీ మణి అని వెలుగు చూసింది. రైల్వేట్రాక్ సమీపంలో మణి మొండెం స్వాధీనం చేసుకున్నారు.

ఫిగర్ దెబ్బకు ఫినిష్ ?
పక్కాప్లాన్ తో ఓ ఫిగర్ సహాయంతో రౌడీ మణిని రైల్వే ట్రాక్ పక్కకు పిలిపించి ఐదు మంది అతని తల, మొండెం నరికి దారుణంగా చంపేశారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. మణిని హత్య చేసిన ఆ ఐదు మంది ఎవరు, మణికి చివరి నిమిషంలో ఫోన్ చేసిన ఆ లేడీ ఎవరు ? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఎలక్షన్ టైమ్ లో కలకలం
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు గంట మోగింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆలయాలకు ప్రపంచ ప్రసిద్ది చెందిన తంజావూరులో ఓ యువకుడు దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది. యువకుడి తల నరికి ఆలయం తలుపు ముందు పెట్టడం తంజావూరు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది.