దేవాలయంలో పేరు మోసిన రౌడీ భవాని దారుణ హత్య
బెంగళూరు: పాతకక్షల కారణంగా పేరు మోసిన రౌడిషీటర్‌ను అతి దారుణంగా హత్య చేసిన సంఘటన బెంగళూరు నగర శివార్లలోని మాదనాయకనహళ్ళి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రౌడిషీటర్ భవాని అలియాస్ మంజునాథ్ అనే వ్యక్తిని సోమవారం ఉదయం ప్రత్యర్థులు వేటకోడవళ్లతో నరికి తల మీద బండరాళ్లు వేసి కిరాతకంగా హత్య చేశారు. బెంగళూరులోని కామాక్షిపాళ్య, తలఘట్టపుర, మాగడి రోడ్డు, మాదనాయకనహళ్ళి పోలీస్ స్టేషన్ లలోని రౌడిషీటర్ల జాబితాలో భవాని పేరు ఉంది.
భవాని విచ్చలవిడిగా క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. ఇతని అరాచకాలు ఎక్కువ కావడంతో గూండ ఆక్ట్ చట్టం కింద భవానిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. కొన్ని నెలల పాటు జైలులో ఉన్న భవాని నాలుగు రోజుల క్రితం బెయిల్ మీద బయటకు వచ్చాడు. సోమవారం ఉదయం మాదనాయకనహళ్ళిలోని కడబి నగరలో ఉన్న శ్రీ ముత్తురాయస్వామి దేవాలయంలోకి వెళ్లాడు. అప్పటి వరకు వేచి ఉన్న ప్రత్యర్థులు ఒక్క సారిగా భవాని మీద విరుచుకుపడ్డారు.

వేటకోడవళ్లతో ఇష్టం వచ్చినట్లు నరకడంతో భవాని కుప్పకూలిపోయాడు. కిందపడిన అతని తల మీద బండరాళ్లు వెయ్యడంతో సంఘటనా స్థలంలోనే భవాని ప్రాణాలు పోయాయి. విషయం తెలుసుకున్న భవాని అనుచరులు సంఘటనా స్థలానికి చేరుకొవడంతో ఉద్రిక్త పరిస్థితి ఎర్పడింది. ముందు జాగ్రత చర్యగా కడిబి నగరలో పోలీసులు గట్టి బందో బస్తు ఎర్పాటు చేశారు.
కడపకు చెందిన మంజునాథ్ బెంగళూరు చేరుకుని టెంపో డ్రైవర్ గా పని చేసేవాడు. ఆ సమయంలో దోపిడీలు, దోమ్మిలు చేశాడు. తరువాత పేరు మోసిన రౌడిషీటర్ పాయిజన్ రామ గ్యాంగ్ లో చేరాడు. అప్పటి నుండి హత్యలు, కిడ్నాప్ లు చేస్తూ వస్తున్నాడు. ఇతని మీద అనేక కేసులు నమోదు అయ్యాయి.
చాలా కేసులు విచారణలో ఉన్నాయి. మద్యపానం నిషేదించాలని పోరాటం చేస్తున్న ఏ.టి. బాబును హత్య చేసిన కేసులో భవాని ప్రధాన నిందితుడు. భవాని హత్య కేసులో ఇప్పటికే కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications