వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.2వేల నగదు రద్దుపై, రూ. 1000 నాణెంపై స్పష్టత ఇవ్వని కేంద్రం

పెద్ద నోట్ల రద్దు తర్వాత కరెన్సీ లభ్యత, రూ.2వేల నోట్ల రద్దుపై వస్తున్న వదంతులు, అంచనాలపై రాజ్యసభలో విపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత కరెన్సీ లభ్యత, రూ.2వేల నోట్ల రద్దుపై వస్తున్న వదంతులు, అంచనాలపై రాజ్యసభలో విపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. ముఖ్యంగా రెండువేల నోజ్ల రద్దుపై విపక్షాలు ప్రభుత్వంపై ప్రశ్నలను కురిపించాయి.

రూ.2వేలనగదు నోట్ల ప్రింటింగ్‌ను నిలిపివేసిన ఆర్‌బిఐరూ.2వేలనగదు నోట్ల ప్రింటింగ్‌ను నిలిపివేసిన ఆర్‌బిఐ

వెయ్యిరూపాయాల నాణెం ప్రవేశపెట్టడం లాంటి పుకార్ల నేపథ్యంలో రాజ్యసభలో విపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. ముఖ్యంగా విపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ గులాంనబీ ఆజాద్ వెయ్యిరూపాయాల నాణెం ప్రవేశపెడుతున్నారా లేదా అనే అంశంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోరారు.

Rs 1000 coin coming? Opposition wants govt to clarify

వెయ్యి, వంద, రెండువందల నాణెలపై తాము ప్రతిరోజూ చదువుతున్న వార్తల్లో వాస్తవం ఎమిటో తెలియాలని కోరారు. వీటిపై ఆర్థిక మంత్రి జైట్లీ స్పష్టత ఇవ్వాలని కోరారు. వెయ్యి రూపాయాల నాణెలను తీసుకెళ్ళడానికి బ్యాగ్ కొనుగోలు చేయాలా అంటూ ఆయన చమత్కరించారు.

అటు జీరో అవర్లో ఎస్‌పి నాయకుడు నరేష్ అగర్వాల్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. రూ.2వేల నోట్లను రద్దుచేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఆర్‌బిఐ ఈ నోట్లను ప్రింట్ చేయకూడదని ఆదేశించింది. ఈ రకమైన విధానపరమైన నిర్ణయాలను పార్లమెంట్‌లో ప్రకటిస్తారని నరేష్ అగర్వాల్ గుర్తుచేశారు.

అయితే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ కురియన్ ఈ విషయమై జోక్యం చేసుకొని ఇది ఆర్‌బిఐ పని అని చెప్పారు.అయితే ఆర్‌బిఐ వ్యతిరేకించిన డీమానిటైజేషన్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్న విషయాన్ని ప్రస్తావించారు.

ఈ విషయమై ప్రభుత్వం నుండి వివరణ కావాలంటూ డిఎంకె ఎంపి తిరుచి శివ డిమాండ్ చేశారు. పుకార్లు బలంగా ఉన్నందున ఈ సమస్య తీవ్రమైందని శరద్ యాదవ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వివరణ ద్వారా పుకార్లకు చెక్ పెట్టొచ్చన్నారు.

అయితే ఈ విషయమై ప్రభుత్వం స్పష్టత రాలేదు. ఈ అంశంపై ఆర్థిక మంత్రి జైట్లీ మౌనంగానే ఉన్నారు.

English summary
The Opposition on Wednesday asked Finance Minister Arun Jaitley in the Rajya Sabha to clarify whether the government has decided to scrap the newly launched Rs 2,000 note and introduce a Rs 1,000 coin instead.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X