విదేశీ మహిళ అరెస్టు: రూ. 20 కోట్ల డ్రగ్స్ సీజ్
కొచ్చి: కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. విదేశీ మహిళలను అరెస్టు చేసి రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు. డ్రగ్స్ ఎక్కడికి తరలించడానికి ప్రయత్నిస్తున్నారనే విషయంపై ఆరా తీస్తున్నారు.
కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ప్రయాణికుల లగేజ్ పరిశీలిస్తున్నారు. ఆ సందర్బంలో అక్కడికి దక్షిణ ఆఫ్రీకాకు చెందిన మహిళ వెళ్లారు. తరువాత కస్టమ్స్ అధికారులు ఆమె లగేజ్ బ్యాగ్ లను పరిశీలించారు.

బ్యాగ్ లో 14.580 కేజీల డ్రగ్స్ బయటపడటంతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వెంటనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ ప్రస్తుత మార్కెట్ లో రూ. 20 కోట్లు ఉంటుందని అధికారులు అన్నారు.
దక్షిణ ఆఫ్రీకా మహిళ వెనుక పెద్ద డ్రగ్స్ మాఫియా ముఠా ఉందని అధికారులు అంటున్నారు. ఈమె దోహా నుండి కొచ్చి వచ్చిందని అధికారులు అన్నారు. ఈమె వెనుక ఉన్న ర్యాకెట్ సభ్యుల గురించి ఆరా తీస్తున్నామని అధికారులు అన్నారు. కేసు దర్యాప్తులో ఉన్నందున ఆ మహిళ పేరు చెప్పడానికి అధికారులు నిరాకరించారు.












Click it and Unblock the Notifications