వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత 3,300 కోట్ల నల్ల ధనం గుర్తింపు

పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత దేశ వ్యాప్తంగా 3300 కోట్ల నల్ల సంపదను వెలుగుచూసింది. ఐటి దాడుల ద్వారా 92 కోట్ల కొత్త కరెన్సీని స్వాధీనం చేసుకొన్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ :పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత దేశ వ్యాప్తంగా సుమారు 3,300 కోట్ల నల్ల సంపదను వెలుగులోకి తీసుకువచ్చింది.దేశ వ్యాప్తంగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు నిర్వహించిన దాడుల్లో 92 కోట్ల కొత్త కరెన్సీని స్వాధీనం చేసుకొన్నారు.

పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశ వ్యాప్తంగా నల్ల ధనంపై ఆధాయపు పన్నుశాఖాధికారులు దాడులు నిర్వహించారు. నోట్ల రద్దు తర్వాత ఆదాయపు పన్నుశాఖాధికారులు 734 చోట్ల దాడులు, సోదాలు నిర్వహించారు. అంతే కాకుండా పన్ను ఎగవేత, హవాలా వ్యాపారం వెల్లడించని సంపద తదితర అభియోగాలకు సంబందించి 3200 మందికి నోటీసులు పంపించారు.

 rs 3,300 cr black income detected since Nov 9

పెద్ద ఎత్తున జరిగిన దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో 500 కోట్లకు పైగా విలువ చేసే బంగారం, ఆభరణాలు , నగదు లభించాయి. అంతేకాకుండా 92 కోట్ల కొత్త రెండు వేల నోట్లను స్వాధీనం చేసుకొన్నారు.

ఇప్పటివరకు సుమారు ఐదువందల కోట్ల ఆస్తులను ఆధాయపు పన్నుశాఖ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. అందులో 421 రూపాయాలను రద్దైన పాత కరెన్సీ రూపంలో ఉంది.ఐటి దాడులకు సంబందించి 220 సీరియస్ కేసుల విచారణ భాద్యతను తన సోదర సంస్థలైన సిబిఐ ,ఈఢీలకు ఐటిశాఖ అప్పగించిందని అధికారవర్గాలు తెలిపాయి.

English summary
official sources said the taxman has carried out a total of 734 search survey and enquiry opertaions under the 734 search, survey and enquiry operations under the provisions of the income tax act.since the note ban was declared even as the department issued ove 3200 notices to various entities on chages of tax evasion and hawala like dealing income tax department seized cash and jewellery worth 500 crore during the same period even as the new currency seized.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X