PM Modi: ఐదేళ్లలో 550 కోట్లు.. మోదీ విదేశీ టూర్ల ఖర్చు బయటపెట్టిన కేంద్రం

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకు సంబంధించిన ఖర్చుల వివరాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ప్రధాని చేపడుతున్న విదేశీ పర్యటనల వ్యయం గణనీయంగా పెరిగినట్లు ప్రభుత్వం రాజ్యసభ వేదికగా వెల్లడించింది. 2021లో నమోదు అయిన ఖర్చుతో పోలిస్తే 2025 నాటికి ఈ వ్యయం ఏకంగా ఐదు రెట్లు పెరిగినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరీటా గురువారం సభలో అడిగిన ప్రశ్నకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఈ విషయాలను పంచుకున్నారు.

Rs 550 Cr Spent on PM Modi Overseas Visits Since 2021 Foreign Ministry Defends Expenditure

విదేశాంగ శాఖ అందించిన సమాచారం ప్రకారం, 2021 సంవత్సరం నుంచి ఇప్పటివరకు ప్రధాని మోదీ జరిపిన విదేశీ పర్యటనలకు మొత్తం రూ. 550 కోట్లకు పైగా ఖర్చు అయింది. ఏడాది వారీగా చూస్తే..

  • 2021లో రూ. 36 కోట్లు,
  • 2022లో రూ. 55 కోట్లు
  • 2023లో రూ. 93 కోట్లు,
  • 2024లో రూ. 109 కోట్లు,
  • 2025లో రూ. 180 కోట్లు
  • 2026లో ఇప్పటివరకు నమోదైన వివరాల ప్రకారమే రూ. 74.58 కోట్లకు పైగా వ్యయమైంది.
మోదీ పిలుపు, యూత్ శపథం: 100 వారాల పాటు భారీ కార్యక్రమం
మోదీ పిలుపు, యూత్ శపథం: 100 వారాల పాటు భారీ కార్యక్రమం

ఈ ఏడాది నార్వే టూర్‌దే టాప్ బిల్లు

ప్రస్తుత సంవత్సరంలో నిర్వహించిన పర్యటనల ప్రాథమిక లెక్కల ప్రకారం.. మే నెలలో ఐదు దేశాల పర్యటనలో భాగంగా మోదీ చేపట్టిన నార్వే పర్యటనకే అత్యధికంగా రూ. 17.46 కోట్లు ఖర్చయినట్లు మంత్రి సభకు వివరించారు. జూన్‌లో నిర్వహించిన ఫ్రాన్స్ పర్యటనకు సంబంధించిన తుది బిల్లులు ఇంకా రావాల్సి ఉందని తెలిపారు. ఇవన్నీ కేవలం విమాన ప్రయాణాలు, భద్రత, బస, దౌత్యపరమైన ఏర్పాట్లకు సంబంధించిన ఖర్చుల పరిధిలోకి వస్తాయి.

UPI Payments: ఇక ఫ్రీ కాదు, తేల్చేసిన ఆర్బీఐ గవర్నర్!
UPI Payments: ఇక ఫ్రీ కాదు, తేల్చేసిన ఆర్బీఐ గవర్నర్!

రూ. లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులే సమాధానం!

పర్యటనల వ్యయంపై వస్తున్న విమర్శలను విదేశాంగ శాఖ గట్టిగానే తిప్పికొట్టింది. ఈ పర్యటనల వల్ల దేశానికి చేకూరిన దౌత్య, ఆర్థిక ప్రయోజనాలను సభ ముందుంచింది. జూలై 2021 నుంచి ఇప్పటివరకు వివిధ దేశాలతో రక్షణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు, డిజిటల్ టెక్నాలజీ, పునరుత్పాదక ఇంధనం, అంతరిక్షం వంటి కీలక రంగాలలో 316 ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరినట్లు వెల్లడించింది.

అంతేకాకుండా, ఏప్రిల్ 2021 నుంచి డిసెంబర్ 2025 మధ్యకాలంలో దేశంలోకి ఏకంగా 381.8 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తరలివచ్చాయని, ప్రధాని పర్యటనలు భారత ఆర్థిక వ్యవస్థ బలపడేందుకు ఎంతగానో తోడ్పడ్డాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+