ఆరెస్సెస్ శ్రేణుల అరెస్టుపై కోర్టు చివాట్లు, గౌహతిలో సీబీఐ డైరెక్టర్ కునుకు
చెన్నై: రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్(ఆరెస్సెస్) వారి డ్రెస్ కోడ్‌ను సాకుగా చూపి, వారి ప్రదర్శనల సమయంలో స్వయం సేవకులను అరెస్టు చేయడం సరికాదని మద్రాసు హైకోర్టు అభిప్రాయపడింది. ఈ అరెస్టు అధికారుల అసహనాన్ని వెల్లడిస్తోందని, అంతేతప్ప కర్తవ్య నిర్వహణకు సంకేతం కాబోదని హైకోర్టు శనివారం చివాట్లు పెట్టింది.
అరెస్సెస్ ప్రదర్శనల నిషేదం కోరుతూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా షరతులతో కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో, తమిళనాడులోని వివిధ జిల్లాల్లో ఆరెస్సెస్ యూనిఫాం తమ వస్త్రధారణను పోలి ఉందంటూ పోలీసులు వారిని అరెస్టు చేస్తున్నారు.
దీని పైన హైకోర్టులో ఆరెస్సెస్ రాష్ట్ర శాఖ కోర్టు ధిక్కార పిటిషన్ వేసింది. అయితే, తుది తీర్పు వచ్చే వరకు పిటిషన్‌ను స్వీకరించలేమని పేర్కొంది.

జాతీయ భద్రతా సమావేశంలో సిబిఐ డైరెక్టర్ కునుకు!
దేశ భద్రతకు సంబంధించి అత్యంత కీలకమైన సమావేశం జరుతుంటే అత్యున్న దర్యాప్తు సంస్థ అధిపతి రంజిత్ సిన్హా కునుకు తీస్తూ వివాదానికి కేంద్ర బిందువయ్యారు. అసోం రాజధాని గౌహతిలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన శనివారం జరిగిన డిజిపి, ఐజిపిల సమావేశంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.
జాతీయ భద్రతకు సంబంధించి రాజ్‌నాథ్ అధ్యక్షన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో సిబిఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా కునుకు తీస్తూ కనిపించారు. సరిహద్దులో పాకిస్తాన్ చొరబాట్లు, ఇస్లామిక్ ఉగ్రవాద కార్యక్రమాలపై రాజ్‌నాథ్ మాట్లాడుతున్న సమయంలో ఆయన కునుకు తీశారు. ఇదంతా కెమెరాల్లో బందించారు.












Click it and Unblock the Notifications