నేతాజీ జయంతిలో జై శ్రీరామ్ నినాదాలా-ఆరెస్సెస్ అసంతృప్తి-బీజేపీ చర్యలకు డిమాండ్
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ చేస్తున్న ఫీట్లు ఆరెస్సెస్‌కు కోపం తెప్పిస్తున్నాయి. తాజాగా కోల్‌కతాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై ఆరెస్సెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆరోజు జరిగిన పరిణామాలపై బీజేపీ స్పందించి చర్యలు తీసుకోవాలని తాజాగా ఆరెస్సెస్ నేతలు కోరారు.
కోల్‌కతాలో ఈ నెల 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్‌లో నిర్వహించిన పరాక్రమ్ దివస్ వేడుకల్లో ప్రధాని మోడీతో పాటు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొందరు బీజేపీ కార్యకర్తలు జై శీరామ్ నినాదాలు చేశారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన మమత ఈ సభలో మాట్లాడేందుకు నిరాకరించారు. దీంతో ఈ నినాదాల వ్యవహారం వివాదాస్పమైంది. నేతాజీ జయంతి కార్యక్రమంలో మాట్లాడేందుకు సీఎం మమతను ఆహ్వానించగానే జై శ్రీరామ్ నినాదాలు చేయడంతో ఆమె ఇది ప్రభుత్వ కార్యక్రమమని, రాజకీయ కార్యక్రమం కాదని, మర్యాదగా వ్యవహరించాలని, ఇలా అతిధుల్ని పిలిచి అగౌరవపరిచే చర్యలకు దిగడం నిర్వాహకులకు మంచిది కాదని ఆమె వ్యాఖ్యానించారు. దీంతో ఈ నినాదాలు చేసిన వారిపై విమర్శలు వెల్లువెత్తాయి.

Recommended Video
ఓ స్వాతంత్ర సమరయోధుడి జయంతిని అవమానించే విధంగా జై శ్రీరామ్ నినాదాలు చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆరెస్సెస్ ఓ ప్రకటనలో కోరింది. నేతాజీకి నివాళులు అర్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యక్రమంలో జై శ్రీరామ్ నినాదాలు చేయడం ఏంటని బెంగాల్ ఆరెస్సెస్ కార్యదర్శి జిష్ణు బసు మండిపడ్డారు. జై శ్రీరామ్ నినాదాలు చేసిన వారు తమ చర్యలతో అటు నేతాజీకీ ఇటు రాముడికీ ఇద్దరికీ గౌరవం లేకుండా చేశారని విమర్శించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications