వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Russia Ukraine War: ఎట్టకేలకు ఉక్రెయిన్ నుంచి బెంగళూరుకు విద్యార్థి మృతదేహం, సీఎం క్లారిటి !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఉక్రెయిన్ పై యుద్దం ప్రకటించిన రష్యా ఇంకా శాంతించలేదు. మా డిమాండ్లు తీరే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తేలేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తేల్చి చెప్పారు. ఇదే సమయంలో రష్యాకు తగినబుద్ది చెప్పే వరకు మేము నిద్రపోమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అంటున్నారు. ఉడత లాంటి ఉక్రెయిన్ మీద రష్యా విరుచుకుపడటంతో ఆదేశం అంటే గిట్టని అమెరికా, బ్రిటన్, కెనడాతో పాటు అనేక దేశాలు మండిపడుతున్నాయి. రష్యా దాడులతో ఉక్రెయిన్ లో నివాసం ఉంటున్న అనేక మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయారు. రష్యా దాడులతో బంకర్ లో తలదాచుకున్న భారత్ లోని కర్ణాటకకు చెందిన యువకుడు ఆహారం తెచ్చుకోవడానికి బయటకు వచ్చాడు.

ఆహారం తీసుకోవడానికి వెలుతున్న కన్నడిగుడి మీద రష్యా బాంబుల దాడి కురిపించడంతో అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మూడువారాల నుంచి కర్ణాటక యువకుడి మృతదేహాన్ని అతని సొంత ఊరికి తీసుకురావడానికి కేంద్ర విదేశాంగ శాఖతో పాటు కర్ణాటక ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. చివరికి ఉక్రెయిన్ లో బాంబుల దాడుల్లో చనిపోయిన యువకుడి మృతదేహాన్ని తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేశామని, కచ్చితంగా ఆరోజు కుటుంబ సభ్యులకు యువకుడి మృతదేహం అప్పగిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ తెలిపారు.

Illegal affair: భర్తకు హ్యాండ్, పుట్టింటి పక్కనే ప్రియుడు, తండ్రిని సజీవదహనం చేసిన కూతురు !Illegal affair: భర్తకు హ్యాండ్, పుట్టింటి పక్కనే ప్రియుడు, తండ్రిని సజీవదహనం చేసిన కూతురు !

 ఉక్రెయిన్ లో రష్యా అరాచకం

ఉక్రెయిన్ లో రష్యా అరాచకం

ఉక్రెయిన్ పై యుద్దం ప్రకటించిన రష్యా ఇంకా శాంతించలేదు. మా డిమాండ్లు తీరే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తేలేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తేల్చి చెప్పారు. ఇదే సమయంలో రష్యాకు తగినబుద్ది చెప్పే వరకు మేము నిద్రపోమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అంటున్నారు. రష్యా అరాచకాలతో ఇప్పటికే సుమారు 35 లక్షల మంది అమాయక ప్రజలు ఆదేశాన్ని వదిలేసి పొరుగు దేశాలకు వలస వెళ్లిపోయారు.

 అమాయకులు బలి

అమాయకులు బలి

ఉడత లాంటి ఉక్రెయిన్ మీద రష్యా విరుచుకుపడటంతో ఆదేశం అంటే గిట్టని అమెరికా, బ్రిటన్, కెనడాతో పాటు అనేక దేశాలు మండిపడుతున్నాయి. రష్యా దాడులతో ఉక్రెయిన్ లో నివాసం ఉంటున్న అనేక మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రష్యా దాడుల్లో ఉక్రెయిన్ సైనికులతో పాటు మహిళలు, చిన్నారులు, ముసలివాళ్లు ఉన్నారు.

 కన్నడిగుడు బలి

కన్నడిగుడు బలి

రష్యా దాడులతో బంకర్ లో తలదాచుకున్న భారత్ లోని కర్ణాటకలోని హావేరి జిల్లాలోని బెళగేరికి చెందిన నవీన్ గ్యానగౌడర్ అలియాస్ నవీన్ అనే యువకుడు మార్చి 1వ తేదీన ఉక్రెయిన్ లో ఆహారం తెచ్చుకోవడానికి బయటకు వచ్చాడు. ఆహారం తీసుకోవడానికి వెలుతున్న నవీన్ మీద రష్యా బాంబుల దాడి కురిపించడంతో అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

 అనేక ప్రయత్నాలతో చివరికి !

అనేక ప్రయత్నాలతో చివరికి !

మూడువారాల నుంచి కర్ణాటక యువకుడు నవీన్ మృతదేహాన్ని అతని సొంత ఊరికి తీసుకురావడానికి కేంద్ర విదేశాంగ శాఖతో పాటు కర్ణాటక ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. చివరికి ఉక్రెయిన్ లో బాంబుల దాడుల్లో చనిపోయిన యువకుడు నవీన్ మృతదేహాన్ని తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేశామని, కచ్చితంగా సోమవారం రోజు అతని కుటుంబ సభ్యులకు యువకుడి మృతదేహం అప్పగిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ తెలిపారు. మార్చి 20వ తేదీ సోమవారం వేకువ జామున 3 గంటల సమయానికి బెంగళూరు ఎయిర్ పోర్టుకు నవీన్ మృతదేహం చేరుకుంటుందని సీఎం బసవరాజ్ బొమ్మయ్ ట్విట్ చేశారు.

English summary
Russia Ukraine War: Ukraine Kannada student Naveen dead body will transporting to India on March 20th, says Karnataka CM.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X