స్వామి శరణం: భక్తుల కష్టాలు తీరుతున్నాయ్
కేరళలో వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు శబరిమలకు వెళ్తుంటారు. అయ్యప్ప మాలను ధరించి, మండలం పాటు నిష్ఠతో మణికంఠుడిని పూజిస్తారు. అనంతరం అయ్యప్పను దర్శించుకోవడానికి తరలి వెళ్తుంటారు. శబరిమలకు వెళ్లే భక్తులకు కేరళ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
శబరిమల గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. దీనిపై డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ను పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు అందజేసింది కూడా. మొత్తం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయాన్ని 7,047 కోట్ల రూపాయలుగా నిర్ధారించింది. ఈ విషయాన్ని డీపీఆర్ లో పొందుపరిచింది.

మొత్తం 2,570 ఎకరాల భూమిని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయి అనుమతులు కూడా లభించాయి. రూ. 7,047 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదిత శబరిమల విమానాశ్రయం డీపీఆర్ ను ఎస్టీయూపీ అనే కన్సల్టెన్సీ సంస్థ రూపొందించింది. దీన్నికేరళ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ.. తాజాగా కేంద్రానికి పంపించింది.
ఇప్పటికే కేంద్రం నుంచి సైట్ క్లియరెన్స్ కూడా లభించడంతో డీపీఆర్ ఆమోదం పొందడం సులభమవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ విమానాశ్రయాన్ని ఏటా ఏడు లక్షల మంది ప్రయాణికులు వినియోగించుకుంటారని కేరళ ప్రభుత్వం అంచనా వేసింది.
శబరిమల యాత్రికులకు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఇది ఎంతో అనువుగా ఉంటుందని డీపీఆర్ లో పేర్కొంది. ఈ విమానాశ్రయం ఇడుక్కి, కొట్టాయం, పథనంథిట్ట జిల్లాలతో పాటు పొరుగునే తమిళనాడు ఉత్తర ప్రాంత జిల్లాలవారికి కూడా సేవలు అందిస్తుందని భావిస్తోంది.
డొమెస్టిక్, ఇంటర్నేషనల్ విమానాలను నడిపేందుకు అనువుగా ఈ విమానాశ్రయాన్ని రూపొందిస్తున్నారు. ఇది కేరళలో అయిదవ విమానాశ్రయంగా అవతరించనుంది. మణిమాల, ఎరుమేలి పంచాయతీలలోని చెరువల్లి ఎస్టేట్‌తో పాటు ప్రైవేట్ భూముల్లో దీనిని నిర్మిస్తారు.
ఇందులో 2,263 ఎకరాల చెరువల్లి ఎస్టేట్ భూమి, 307 ఎకరాల ప్రైవేట్ భూమి ఉంది. ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. భూసేకరణ కోసం ప్రస్తుతం ఆ ప్రాంతంలో భూముల సర్వే జరుగుతోంది. 2013 చట్టం ప్రకారం నష్టపరిహారం అందజేస్తారు.
రెవెన్యూ శాఖ సెక్షన్ 11(1) కింద నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. చెరువల్లి ఎస్టేట్ భూమిని అయానా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని బిలీవర్స్ చర్చ్ ఉంది. లీజు కాలం ముగియడంతో ఆ భూమి ప్రభుత్వానిదేనని ప్రభుత్వం వాదిస్తోంది. భూమి తమదని రెవెన్యూ శాఖ పాల కోర్టులో సివిల్ కేసు దాఖలు చేసింది. ప్రాజెక్టు సర్వేలను సవాలు చేస్తూ ట్రస్ట్ హైకోర్టును ఆశ్రయించింది.
ఈ చెరువల్లి ఎస్టేట్ సెంట్రల్ కేరళ పరిధిలోకి వస్తుంది. సెంట్రల్ ట్రావెన్‌కూర్ రీజియన్ పరిధిలోని అయిదు జిల్లాల సరిహద్దులకు ఆనుకుని ఉంటుంది. వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు ఉంది. ఈ ఎయిర్‌పోర్టును నిర్మించడం వల్ల ఈ అయిదు జిల్లాల ప్రజలకు అనుకూలంగా ఉంటుందని, ఆయా జిల్లాలన్నీ అభివృద్ధి చెందుతాయని కేరళ ప్రభుత్వం భావిస్తోంది.
విమానాశ్రయానికి సంబంధించిన ఇతర వివరాలు
- గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 7,047 కోట్ల రూపాయలు.
- ప్రారంభ అంచనా వ్యయం: 3,450 కోట్ల రూపాయలు.
- భూసేకరణ, పునరావాసం: 2,408 కోట్ల రూపాయలు.
- రన్ వే పొడవు: 3,500 మీటర్లు.
- ప్రయాణీకుల టెర్మినల్: 54,000 చదరపు అడుగులు.
- కార్గో ఏరియా: 1,200 చదరపు అడుగులు
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications