Sabarimala: శబరిమల భక్తులకు AtoZ ఉండాలి, మండల పూజకు పర్చువల్ క్యూ లైన్లు, టిక్కెట్లు లేకుంటే!
శబరిమల/ పంపా/ కొచ్చి: పవిత్ర పుణ్యక్షేత్రం అయిన శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో మండల పూజలు నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. శరిమలకు వచ్చే భక్తులు కచ్చితంగా కేరళ ప్రభుత్వం ఆదేశాలు, సూచనలు పాటించాలని శబరిమల ఆలయం, దేవస్వం బోర్డు నిర్వహకులు తెలిపారు. శబరిమల అయ్యప్పస్వామి సన్నిధానంలో పర్చువల్ క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. పర్చువల్ క్యూ లైన్ల నిర్వహణను ప్రత్యేక అధికారులు పర్యవేక్షిస్తున్నారు. శబరిమల అయ్యప్పస్వామి దర్శనం కోసం వచ్చే భక్తులు ఆన్ లైన్ టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి A to Z నియమాలు కచ్చితంగా పాటించాలని అధికారులు సూచించారు.
Sabarimala: శబరిమలలో తంక-అంకికి శ్రీకారం, అయ్యప్ప నగలు ఊరేగింపు, జీవితం ధన్యం, భక్తులకు!

టిక్కెట్లు ఉంటే రండిస్వామి
మండల పూజ సందర్బంగాఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు ముందుగానే ఆన్ లైన్ లో దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకుని ఉంటే మాత్రమే శబరిమలకు రావాలని దేవస్వం బోర్డు అధికారులు మనవి చేశారు. డిసెంబర్ 26వ తేదీన శబరిమల అయ్యప్పస్వామి సన్నిధానంలో మండల పూజలు నిర్వహించడానికి అధికారులు సర్వం సిద్దం చేస్తున్నారు. శబరిమల అయ్యప్ప భక్తుల కోసం పర్చువల్ క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.

సర్టిఫికెట్ ఉంటేనే వెళ్లాలి
శబరిమలకు వెళ్లే భక్తుల కోసం కేరళ ప్రభుత్వం, కేరళ పోలీసులు ప్రత్యేక వెబ్ సైట్ నిర్వహిస్తున్నారు. శబరిమల ఆన్ లైన్ సర్వీస్ పోర్టల్ లోని పూర్తి వివరాలను శబరిమలకు వెళ్లే భక్తులు పొందుపరచాలి. అదే విదంగా శబరిమలకు వెళ్లే అయ్యప్పస్వామి భక్తులు 48 గంటల ముందే ఆర్ టీ పీఆర్ సీ పద్దతిలో కోవిడ్ పరీక్షలు చేయించుకుని కచ్చితంగా అధికారులు ఇచ్చే దృవీకరణ పత్రాన్ని వెంట తీసుకెళ్లాలి.

A to Z వివరాలు
శబరిమలకు వెళ్లే భక్తులు శబరిమల ఆన్ లైన్ సర్వీస్ పోర్టల్ లోని పూర్తి వివరాలు నమోదు చెయ్యాలని. శబరిమలకు వెళ్లే అయ్యప్పస్వామి భక్తులు ప్రతి ఒక్కరు వారి పేరు, అడ్రస్, ఆధార్ కార్డు, ఓటరు ఐడీ, మొబైల్ ఫోన్ నెంబర్, ఇంటి అడ్రస్, ఇమెయిల్ అడ్రస్ (రాష్ట్రం పేరు కూడా) తదితర పూర్తి వివరాలు నమోదు చెయ్యాల్సి ఉంటుంది.

ఓటీపీ క్రియేట్ చెయ్యాలి
శబరిమల ఆన్ లైన్ సర్వీస్ లో అయ్యప్ప దర్శనం కోసం పేర్లు నమోదు చేసుకున్న తరువాత ప్రతి ఒక్క భక్తుడికి వారి మొబైల్ నెంబర్ కు ఓటీపీ నెంబర్ వస్తుంది. ఆ ఓటీపీ నెంబర్ మళ్లీ వెబ్ సైట్ లో నమోదు చేసి కొత్తగా పాస్ వర్డ్ క్రియేట్ చేసుకున్న తరువాత మరో నెంబర్ వస్తోందని, అప్పుడే వారు శబరిమలకు వెళ్లడానికి అధికారులు పక్కా దృవీకరించారని తెలుస్తోంది.

పర్చువల్ క్యూలైన్లు
శబరిమలకు వెళ్లే భక్తులు ఆన్ లైన్ లో వారి పూర్తి వివరాలు, సమాచారం నమోదు చేసిన తరువాత వారి వెంట ఎంత మంది వెలుతున్నారు, వారి ఫోన్ నెంబర్లు ఏమిటి అనే పూర్తి సమాచారం ఇవ్వాలి. ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకోకుండా శబరిమలకు వచ్చే భక్తులు అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి ఏ మాత్రం అవకాశం ఉండదని అధికారులు చెప్పారు. మండలపూజ సందర్బంగా శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య 5 వేలకు పెంచుతూ ఇటీవల కేరళ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.