Sabarimala: శబరిమలలో ప్రత్యేక పూజలు, ఐదు రోజులు, 5 వేల మంది మాత్రమే, కోవిడ్ రిపోర్టు !
శబరిమల/ తిరువనంతపురం: హిందువులు ఎంతో పవిత్రంగా పూజలు చేసే అయ్యప్పస్వామికి ప్రత్యేక పూజలు మొదలైనాయి. కేరళలోని శబరిమలలో శ్రీ అయ్యప్పస్వామికి ఈ రోజు ప్రత్యేక పూజలు మొదలైనాయి. శబరిమలలో అయ్యప్పస్వామికి ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు చెయ్యడానికి అధికారులు సర్వం సిద్దం చేశారు. శబరిమలలో అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి ప్రతిరోజు 5, 000 మందికి మాత్రమే శబరిమల అయ్యప్పస్వామి బోర్డు అధికారులు అవకాశం కల్పించారు. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు కచ్చితంగా కోవిడ్ పరీక్షలు చేయించుకుని నెగటివ్ సర్టిఫికెట్ చేతపట్టుకుని రావాలని అధికారులు మనవి చేశారు.
Star Hero: వివాదంలో హీరో, హోటల్ లో దళితుడిపై దాడి ?, లాక్ డౌన్ లో పార్టీ, హోమ్ శాఖ ఎంట్రీ !

కోవిడ్ పరీక్షల సర్టిఫికెట్
శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు కచ్చితంగా 48 గంటల ముందు ఆర్ టీపీఆర్ సీ పరీక్షలు చేయించుకోవాలని అధికారులు అయ్యప్ప భక్తులకు సూచించారు. ఆర్ టీపీఆర్ సీ పరీక్షలు చేయించుకుని కచ్చితంగా కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ ఉంటేనే శబరిమల సన్నిధానంలోకి అనుమతి ఇస్తామని శబరిమల దేవోస్వం బోర్డు అధికారులు స్పష్టం చేశారు.

ఐదు వేల మందికే అవకాశం
ఐదు రోజుల పాటు శబరిమలో అయ్యప్పస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు 5 వేల మంది అయ్యప్పను దర్శించుకోవడానికి అవకాశం కల్పించారు. అయ్యప్ప భక్తులకు కోవిడ్ పరీక్షలు చేసుకుని, కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ తీసుకుని రావాలని అధికారులు సూచించారు. అయ్యప్ప భక్తులు తీసుకు వస్తున్న ఆర్ టీపీఆర్ సీ పరీక్షల సర్టిఫికెట్లు నీలక్కల్, పంపాలోని విధులు నిర్వహిస్తున్న పోలీసులు, దేవస్థం బోర్డు ప్రత్యేక అధికారుల పరిశీలిస్తున్నారు.

జులై 21వ తేదీ వరకు
శనివారం (జులై 17వ తేది) శబరిమలోని అయ్యప్పస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు మొదలైనాయి. ఈనెల 21వ తేది బుధవారం వరకు శబరిమలలో అయ్యప్పస్వామికి ప్రత్యేక పూజలు చెయ్యడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. శబరిమలకు వచ్చే భక్తులు కచ్చితంగా కోవిడ్ నియమాలు పాటించాలని అధికారులు మనవి చేశారు.

నియమాలు పాటించండి స్వాములు
అయ్యప్ప భక్తులు అందరూ మాస్క్ లు వేసుకుని, శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవాలని, భౌతిక దూరం పాటించాలని అధికారులు మనవి చేశారు. ఇప్పటకే శబరిమలకు వెళ్లే భక్తులు ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకుని శబరిమలకు వెలుతున్నారు. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ సందర్బంగా శబరిమలలో అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.