ఆస్పత్రిలో ఉద్యోగం నుండి తొలగించాడని, డాక్టర్ కొడుకును కిడ్నాప్ చేసి కాంపౌండర్ల ఘాతుకం
తమను ఉద్యోగం నుంచి తొలగించారని కక్షతో ఓ వైద్యుడిపై పగను పెంచుకున్న ఇద్దరు మాజీ ఉద్యోగులు అభం శుభం తెలియని వైద్యుడి ఎనిమిదేళ్ల కుమారుడిని దారుణంగా హత్య చేశారు. తండ్రిపై ఉన్న కోపాన్ని కుమారుడిపై తీర్చుకున్నారు.ఏ పాపం తెలియని ఎనిమిదేళ్ళ బాలుడి ప్రాణాలు తీశారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన వివరాల్లోకి వెళితే..

ఓ డాక్టర్ కుమారుడు కిడ్నాప్ .. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్‌షహర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం తన కొడుకు కనిపించకుండా పోవడంతో ఒక ప్రముఖ వైద్యుడు అయిన చిన్నారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి 8 సంవత్సరాల వైద్యుని కుమారుడి కోసం గాలింపు మొదలుపెట్టారు. అతనికి శత్రువులు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో సేకరించిన సాక్ష్యాధారాల ఆధారంగా, డాక్టర్ యొక్క ఇద్దరు మాజీ ఉద్యోగులను అనుమానించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

8 ఏళ్ళ బాబును హతమార్చిన నిందితులు ఎవరో తెలిసి షాక్ తిన్న డాక్టర్
వైద్యుడి కుమారుడి కిడ్నాప్‌లో వారి పాత్ర ఉందన్న అనుమానంతో, వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. చివరకు వారే బాలుడిని కిడ్నాప్ చేసినట్టు, హతమార్చినట్టు గుర్తించారు. ఈ విషయం తెలిసిన వైద్యుడు షాక్ కు గురయ్యారు. వారు ఇచ్చిన సమాచారం ప్రకారం గత రెండు రోజులుగా కనిపించకుండా పోయిన వైద్యుని ఎనిమిదేళ్ల కుమారుడి మృతదేహాన్ని బులంద్‌షహర్ పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. చిన్నారి మృతదేహాన్ని ఛతారీ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో స్వాధీనం చేసుకున్నట్లు దేబాయి సర్కిల్ అధికారి వందనా శర్మ తెలిపారు.

ఉద్యోగం నుండి తొలగించారని కక్ష .. బాలుడి మర్డర్
శుక్రవారం రాత్రి బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేశారనే ఆరోపణతో అరెస్టయిన డాక్టర్ వద్ద పనిచేసిన ఇద్దరు మాజీ ఉద్యోగులు నిజాం, షాహిద్‌లను అరెస్టు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో డాక్టర్‌తో కలిసి కాంపౌండర్‌లుగా పనిచేసిన ఇద్దరు తమ పనిలో తప్పిదానికి పాల్పడ్డారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నారని రెండేళ్ల క్రితం డాక్టర్ వారిద్దరినీ ఉద్యోగం నుంచి తొలగించడంతో వారు డాక్టర్ పై శత్రుత్వం పెంచుకున్నారు. అప్పటి నుండి డాక్టర్ ను టార్గెట్ చేస్తూ ఏదో ఒక రకంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే వారు డాక్టర్ కుమారుడిని కిడ్నాప్ చేసి హత్య చేశారు. పోలీస్ మార్క్ విచారణలో వారు పోలీసుల ఎదుట తామే డాక్టర్అం కుమారుడిని కిడ్నాప్ చేసి హత్య చేశామని అంగీకరించారని సర్కిల్ ఇన్స్పెక్టర్ వందన శర్మ వెల్లడించారు.

విషాదంలో డాక్టర్ కుటుంబం; హంతకులుగా మారి కటకటాల పాలైన కాంపౌండర్లు
ఇద్దరు కాంపౌండర్లు ఆస్పతిలో విధి నిర్వహణలో తాము చేసిన తప్పులను తెలుసుకోకపోగా, మళ్ళీ ఇంకో క్షమించరాని నేరం చేశారు. అభం శుభం తెలియని చిన్నారి ప్రాణాలు తీసి ఏకంగా హంతకులుగా మారారు. వీరు చేసిన దారుణానికి డాక్టర్ కుటుంబం కొడుకును కోల్పోయి తీవ్ర వేదనలో ఉంది. ఇక చేసిన నేరానికి ఇద్దరు కాంపౌండర్లు జైలు పాలు కాగా వారి కుటుంబాల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.
క్షణికావేషాలు, అనవసరపు పగలు వెరసి చాలా మంది అనేక కుటుంబాలలో విషాదం మిగులుస్తున్నారు. స్వయంగా వారి జీవితాలను, వారి చిన్నారుల జీవితాలను రోడ్డున పడేస్తున్నారు. మనిషిని మనిషి హతమార్చాలనే నేరపూరిత ఆలోచనలు ఎవరికైనా, ఏ మాత్రం శ్రేయస్కరం కావని గుర్తిస్తే ఈ దారుణాలకు కొంతమేరకు అడ్డుకట్ట పడొచ్చు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications