Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wife: బెడ్ రూమ్ లో భార్య కాళ్లు, చేతులు కట్టేసి ప్రైవేట్ పార్ట్స్ కోసి 10 సార్లు పొడిచిన శాడిస్టు భర్త!

అల్వార్/ జైపూర్/ రాజస్థాన్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతుకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. భర్త వ్యాపారం చేస్తుంటే భార్య ఇంటి దగ్గర ఉంటున్నది. దంపతుల దగ్గర బందువులు, భార్య సోదరుడు సమీపంలోనే నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. రాత్రి మద్యం మత్తులో ఇంటికి వెళ్లిన భర్త అతని భార్యతో గొడవపడ్డాడు. రాత్రి పిల్లలతో కలిసి భోజనం చేసిన భార్య బెడ్ రూమ్ లో నిద్రపోయింది.

వేకువ జామున భార్య గాఢ నిద్రలో ఉన్న సమయంలో హాల్ లో నిద్రపోతున్న భర్త నిద్రలేచి బెడ్ రూమ్ లోకి వెళ్లాడు. నిద్రపోతున్న భార్య కాళ్లు, చేతులు మంచానికి కట్టేశాడు, కత్తి తీసుకుని భార్య శరీరంలో అనేక చోట్ల పొడిచాడు. భార్య కాళ్లు, చేతులు కట్టేయడంతో ఆమె తప్పించుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఆ సందర్బంలో శాడిస్టు భర్త అతని భార్య ప్రైవేట్ పార్ట్స్ మీద 10 సార్లు పొడిచేయడం కలకలం రేపింది.

14 ఏళ్ల క్రితం పెళ్లి

14 ఏళ్ల క్రితం పెళ్లి

రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలోని నహర్ పూర్ గ్రామంలో రతన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 14 సంవత్సరా క్రితం రతన్ కుటుంబ సభ్యులు సెట్ చేసిన దీపిక అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న రతన్, దీపిక దంపతులు సంతోషంగా కాపురం చేశారు. రతన్, దీపికా దంపతుకు 12 ఏళ్ల కుమార్తె, 8 ఏళ్ల కుమారుడు ఉన్నారు.

భార్య మీద అనుమానం

భార్య మీద అనుమానం

కొంతకాలంగా భార్య దీపిక మీద ఆమె భర్త రతన్ అనుమానం పెంచుకున్నాడు మద్యంకు బానిస అయిన రతన్ కు రానురాను భార్య మీద డౌట్ ఎక్కువ అయ్యిందే కాని ఆమె మీద మాత్రం నమ్మకం కదురలేదు. రతన్ వ్యాపారం చేస్తుంటే అతని భార్య దీపిక ఇంటి దగ్గర ఉంటున్నది. ఇంటి దగ్గర ఉంటున్న దీపిక మీద రతన్ కు ఇంకా ఎక్కువ అనుమానం పెంచుకుని మద్యం తాగడానికి బానిస అయ్యాడు.

ఇంటికి వెళ్లి గొడవ చేసిన భర్త

ఇంటికి వెళ్లి గొడవ చేసిన భర్త

రతన్, దీపిక దంపతుల దగ్గర బందువులు, దీపిక సోదరుడు సమీపంలోనే నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా రతన్, దీపికల మద్య అక్రమ సంబంధం విషయంలోనే గొడవలు జరుగుతున్నాయి. రాత్రి మద్యం మత్తులో ఇంటికి వెళ్లిన రతన్ అతని భార్య దీపికతో గొడవపడి ఆమెను చితకబాదేశాడు. బంధువులు సర్దిచెప్పడంతో రతన్ సైలెంట్ అయ్యాడు.

భార్యను మంచానికి కట్టేసిన భర్త

భార్యను మంచానికి కట్టేసిన భర్త

రాత్రి పిల్లలతో కలిసి భోజనం చేసిన దీపిక బెడ్ రూమ్ లోకి వెళ్లి పిల్లలతో కలిసి నిద్రపోయింది. వేకువ జామున 4 గంట సమయంలో దీపిక గాఢ నిద్రలో ఉన్న సమయంలో హాల్ లో నిద్రపోతున్న రతన్ నిద్రలేచి చిన్నగా బెడ్ రూమ్ లోకి వెళ్లాడు. నిద్రపోతున్న భార్య దీపిక కాళ్లు, చేతులు మంచానికి కట్టేశాడు, కత్తి తీసుకుని భార్య దీపిక శరీరంలో అనేక చోట్ల పొడిచాడు.

భార్య ప్రైవేట్ పార్ట్స్ కోసి కత్తితో పొడిచిన శాడిస్టు భర్త

భార్య ప్రైవేట్ పార్ట్స్ కోసి కత్తితో పొడిచిన శాడిస్టు భర్త

భార్య దీపికా తప్పించుకోకుండా ఆమె కాళ్లు, చేతులు కట్టేయడంతో ఆమె తప్పించుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఆ సందర్బంలో శాడిస్టు భర్త రతన్ అతని భార్య దీపిక ప్రైవేట్ పార్ట్స్ మీద 10 సార్లు పొడిచేయడం కలకలం రేపింది. నొప్పి తట్టుకోలేక దీపిక కేకలు వెయ్యడంతో ఆమె కూతురు నిద్రలేచి ఇంటి నుంచి తప్పించుకుని పారిపోయి సమీపంలో నివాసంఉంటున్న మేనమామకు విషయం చెప్పింది.

90 శాతం రక్తం పోయింది

90 శాతం రక్తం పోయింది

దీపికా సోదరుడు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో అప్పటికే శాడిస్టు భర్త రతన్ తప్పించుకుని పారిపోయాడు. తీవ్రగాయాలైన దీపికకు కట్లు విప్పి ఆమెను అల్వార్ లోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. శాడిస్టు భర్త రతన్ కత్తితో దారుణంగా పొవడంతో దీపిక పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు అంటున్నారు. అప్పటికే 90 శాతం రక్త పోవడంతో దీపిక మాట్లాడలేని పరిస్థితిలో ఉంది.

ఐసీయూలో భార్య

ఐసీయూలో భార్య

దీపికకు 5 యూనిట్ల రక్తం ఎక్కించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని వైద్యులు, పోలీసులు చెప్పారని దైనిక్ భాస్కర్ మీడియా సంస్థ సోమవారం కథనం ప్రచురించింది. దీపిక పరిస్థితి విషమంగానే ఉందని, ఆమె కోలుకున్న తరువాత స్టేట్ మెంట్ తీసుకుంటామని, శాడిస్టు రతన్ కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారని స్థానిక మీడియా తెలిపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+