Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Sadist: రాత్రి లేటుగా వెళ్లిన భార్య, ఇంట్లో బేకారుగా ఉన్న భర్త గొడవ, మూడు నెలల కొడుకును చంసేశాడు !

న్యూఢిల్లీ: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులు హ్యాపీగా ఉన్నారని కుటుంబ సభ్యులు, బంధువులు అనుకున్నారు. మూడు నెలల క్రితం భార్య పండంటి కొడుకుకు జన్మనిచ్చింది. మూడు నెలల బిడ్డను చూసుకుంటానని చెప్పిన భర్త ఇంట్లో బేకారుగా పడి ఉన్నాడు. భార్య ఉద్యోగం చేస్తూ కష్టపడి డబ్బు సంపాధిస్తూ భర్త, కొడుకును చూసుకుంటున్నది. పని ముగించుకని ఇంటికి వెళ్లిన భార్య మీద ఆమె భర్త కేకలు వేశాడు. ఇంతలేటుగా ఇంటికి ఎందుకు వచ్చావని చిందులు వేశాడు. తనకు ఆకలిగా ఉందని, భోజనం చెయ్యాలని భర్త చెప్పాడు. ఆ సమయంలో నువ్వు కొడుకును చూసుకో, అర్దగంటలో నీకు వంట చేసి పెడుతానని భార్య అతనికి చెప్పింది. తరువాత దంపతుల మద్య మాటల యుద్దం జరిగింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన భర్త అతని మూడు నెలల కొడుకును ఎత్తుకుని గోడకు వేసి చితకబాదడంతో చిన్నారి ప్రాణాలు గాలిలలో కలిసిపోయాయి.

 మూడు నెలల కొడుకు

మూడు నెలల కొడుకు

దేశ రాజధాని ఢిల్లీలోని భల్సా డైరీ సమీపంలోని రాకేష్ (29) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రెండు సంవత్సరాల క్రితం రాకేష్ నిషా అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న రాకేష్, నీషా దంపతులు సంతోషంగా కాపురం చేశారు. నీషా, రాకేష్ దంపతులు హ్యాపీగా ఉన్నారని కుటుంబ సభ్యులు, బంధువులు అనుకున్నారు. మూడు నెలల క్రితం రాకేష్ భార్య నిషా పండంటి కొడుకుకు జన్మనిచ్చింది.

 ఇంట్లో బేకారుగా పడి ఉన్న భర్త

ఇంట్లో బేకారుగా పడి ఉన్న భర్త

కొడుకు పుట్టిన ఆనందంలో నిషా కేవలం రెండు నెలల మాత్రమే ఇంట్లో ఉంది. నేను కొడుకును చూసుకుంటానని, నువ్వు పనికి వెళ్లాలని రాకేష్ అతని భార్యకు చెప్పాడు. ఇంట్లో బిడ్డను చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలని నిషా అనుకుంది. భర్త రాకేష్ అంతంతమాత్రంగానే పని చెయ్యడంతో నేనే పనికి వెలుతానని, నువ్వు ఇంట్లో బిడ్డను చూసుకోవాలని ఆమె భర్త రాకేష్ కు చెప్పింది.

 పీకలదాక మద్యం సేవించి బిడ్డతో ఆడుకుంటున్నాడు

పీకలదాక మద్యం సేవించి బిడ్డతో ఆడుకుంటున్నాడు

ఢిల్లీలోని ఆజాద్ పూర్ లోని ఓ మండిలో నిషా పనికి చేరింది. ఉదయం భార్య నిషా పనికి వెళ్లిన తరువాత మద్యం సేవిస్తున్న రాకేష్ మద్యం మత్తులో బిడ్డతో ఆడుకుంటూ కాలం గడుపుతున్నాడు. సాయంత్రం ఇంటికి వెలుతున్న నిషా వంట చేసి భర్త రాకేష్ పెడుతోంది. పగలంతా బిడ్డను చూసుకునే నెపంతో రాకేష్ ఇంట్లో బేకార్ గా పడి ఉంటూ కాలం గడిపేస్తున్నాడు.

 భార్య లేటుగా వచ్చిందని చిందులు వేసిన భర్త

భార్య లేటుగా వచ్చిందని చిందులు వేసిన భర్త

రోజూ సాయంత్రం పూట ఇంటికి వెలుతున్న నిషా మండిలో పని ఎక్కువగా ఉండటంతో రాత్రి లేటుగా ఇంటికి వెళ్లింది. ఇంతసేపు ఎక్కడికి వెళ్లావు ?, ఏం చేస్తున్నావు ?, అంటూ రాకేష్ అతని భార్య నిషా మీద కేకలు వేశాడు. ఆ సమయంలో కొంత సేపు నిషా, రాకేష్ దంపతుల మద్య వాగ్వివాదం జరిగిందని సమాచారం.

 వెంటనే వంట చెయ్యాలని చెప్పిన భర్త

వెంటనే వంట చెయ్యాలని చెప్పిన భర్త

తన భర్త మద్యం మత్తులో ఉన్నాడని, ఇతనితో ఇప్పుడు గొడవ పెట్టుకుంటే లేనిపోని రామాయణం జరుగుతుందని నిషా సైలెంట్ గా ఉండిపోయింది. తనకు ఆకలిగా ఉందని, భోజనం రెడీ చెయ్యాలని రాకేష్ అతని భార్య నిషాకు చెప్పాడు. ఆ సమయంలో నువ్వు కొడుకును చూసుకో, అర్దగంటలో నీకు వంట చేసి పెడుతానని నిషా అతనికి చెప్పింది.

Recommended Video

    రాజేష్ మగాడంటే నమ్మేదే లేదు.. తొలిరాత్రే చెప్పాడు..!
     బిడ్డను గోడకు వేసి చితకబాది చంపేశాడు

    బిడ్డను గోడకు వేసి చితకబాది చంపేశాడు

    తరువాత దంపతుల మద్య మళ్లీ మాటల యుద్దం జరిగింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన రాకేష్ అతని మూడు నెలల కొడుకును ఎత్తుకుని గోడకు వేసి చితకబాదడంతో చిన్నారి ప్రాణాలు గాలిలలో కలిసిపోయాయి. బిడ్డను గోడకు వేసి కొట్టిన సమయంలో నిషా గట్టగా కేకలు వేసింది. బిడ్డను చంపేసిన రాకేష్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించడంతో స్థానికులు అతన్ని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+