Sadist: ఆంటీ బెడ్ రూమ్, బాత్ రూమ్ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసిన భర్త, అసలు మ్యాటర్ ? !

బెంగళూరు/ శివమొగ్గ: వివాహం చేసుకున్న దంపతులు కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశారు. కొన్ని సంవత్సరాల తరువాత దంపతుల మద్య తేడాలు వచ్చాయి. భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయిన భార్య విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. ఇదే సమయంలో తనకు ప్రతినెల భర్త నుంచి భరణం ఇప్పించాలని భార్య కోర్టుకు మనవి చేసింది. సాయంత్రం ఒంటరిగా నడుచుకుంటూ వెలుతున్న భార్యను అడ్డగించిన భర్త ఆమె మీద దాడి చేశాడు. భర్తతో పాటు అతని వెంట ఉన్న వాళ్లు ఆమెను చితకబాదేశారు. మర్యాదగా నువ్వు కోర్టులో విడాకుల కేసు, భరణం కేసు వెనక్కి తీసుకోకపోతే నువ్వు నాతో కాపురం చేసే సమయంలో తీసిన వీడియోలు, నువ్వు బాత్ రూమ్ లో స్నానం చేస్తున్న సమయంలో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని భర్త బ్లాక్ మెయిల్ చెయ్యడంతో భార్య హడలిపోయింది.

 కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి

కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి

కర్ణాటకలోని శివమొగ్గ పట్టణంలోని దొడ్డపేట్ లో సయ్యద్ అస్గర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. వ్యాపారం చేస్తున్న సయ్యద్ అస్గర్ 1993లో రజియా బేగం (పేరు మార్చడం జరిగింది) అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న సయ్యద్ కొన్ని సంవత్సరాల క్రితం వరకు అతని భార్య రజియాతో సంతోషంగా కాపురం చేశాడు.

 దంపతుల మద్య తేడాలు

దంపతుల మద్య తేడాలు

పెద్దలు కుదుర్చిన పెళ్లి కావడంతో సయ్యద్, రజియా దంపతుల ఇరు వైపుల కుటుంబ సభ్యులు వాళ్ల ఇంటికి వెళ్లేవాళ్లు. కొంతకాలం తరువాత సయ్యద్, రజియా బేగం దంపతుల మద్య తేడాలు వచ్చాయి పదేపదే గొడవలు జరగడంతో సయ్యద్, రజియా దంపతుల పెద్దలు పంచాయితీలు పెట్టారు. కొంతకాలం పంచాయితీలు చేస్తూ ఇద్దరిని కలపడానికి ప్రయత్నించారు.

 పుట్టింటికి వెళ్లిపోయిన భార్య

పుట్టింటికి వెళ్లిపోయిన భార్య

పెద్దలు రాజీ చెయ్యాలని, రజియా, సయ్యద్ దంపతులు జీవితాంతం కలిసి ఉంటే చూడాలని ఉందని అనుకున్నారు. అయితే పెద్దలు అనుకున్నట్లు ఏమీ జరగలేదు. భర్త సయ్యద్ ను వదిలేసిన అతని భార్య రెండు సంవత్సరాల క్రితం ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. పుట్టింటిలో ఉంటున్న ఆమె భర్త సయ్యద్ తో విడాకులు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించింది.

 కోర్టు చుట్టూ తిరుగుతున్న భర్త

కోర్టు చుట్టూ తిరుగుతున్న భర్త

ఇదే సమయంలో తనకు ప్రతినెల భర్త సయ్యద్ నుంచి భరణం ఇప్పించాలని అతని భార్య కోర్టుకు మనవి చేసింది. సయ్యద్ విడాకుల కేసు విచారణకు హాజరుకావాలని కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. సాయంత్రం ఒంటరిగా నడుచుకుంటూ వెలుతున్న భార్యను అడ్డగించిన సయ్యద్ ఆమె మీద దాడి చేశాడు. భర్త సయ్యద్ తో పాటు అతని వెంట ఉన్న వాళ్లు రజియా బేగంను చితకబాదేశారు.

 భార్య నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసిన భర్త

భార్య నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసిన భర్త

నడిరోడ్డులో భార్యను చితకబాదిన సయ్యద్ రెచ్చిపోయాడు. మర్యాదగా నువ్వు కోర్టులో విడాకుల కేసు, భరణం కేసు వెనక్కి తీసుకోకపోతే నువ్వు నాతో కాపురం చేసే సమయంలో తీసిన వీడియోలు, నువ్వు బాత్ రూమ్ లో స్నానం చేస్తున్న సమయంలో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని సయ్యద్ అతని భార్యను బ్లాక్ మెయిల్ చెయ్యడంతో ఆమె హడలిపోయింది. నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లిన భార్య ఆమె భర్త సయ్యద్ చేస్తున్న ఆగడాల గురించి కేసు పెట్టింది. కేసు నమోదు చేసిన పోలీసులు శాడిస్టు మొగుడు సయ్యద్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+