Sadist: రాత్రి రచ్చరచ్చ, తల్లీ, చెల్లిని తుపాకితో కాల్చి చంపేశాడు. తండ్రి ఇంట్లో లేడని, ఎందుకంటే !
మంగళూరు/ బెంగళూరు: తండ్రి సంపాదిస్తుంటే ఆ డబ్బుతో కొడుకు జల్సా చేస్తున్నాడు. ఉద్యోగం చెయ్యాల్సిన వయసులో జులాయిగా స్నేహితులతో తిరుగుతూ జల్సా చేస్తున్న యువకుడు మద్యం సేవించడానికి బానిస అయ్యాడు. ప్రతిరోజూ పీకలదాక మద్యం సేవించి ఇంటికి రావడం, తండ్రి ఇంట్లో ఉంటే సైలెంట్ గా నిద్రపోవడం చేస్తున్నాడు. తండ్రి ఇంట్లో లేకపోతే రెచ్చిపోతున్న యువకుడు అతని తల్లి, చెల్లి మీద ప్రతాపం చూపించడం మొదలు పెడుతున్నాడు. రాత్రి పీకలదాక మద్యం సేవించిన యువకుడు ఇంటికి వెళ్లాడు. తరువాత ఇంట్లో తల్లి, చెల్లితో గొడవ పెట్టుకున్న యువకుడు సహనం కోల్పోయి తుపాకి తీసుకుని తల్లీ, చెల్లిని స్పాట్ లో కాల్చి పారేశాడు. కొడుకు అతని తల్లి, చెల్లిని హత్య చేసిన సమయంలో తండ్రి ఇంట్లో లేడని పోలీసులు అంటున్నారు. కన్న తల్లి, సొంత చెల్లిని ఆ కాలాంతకుడు ఎందుకు హత్య చేశాడు ? అనే అసలు విషయం తెలుకున్న బంధువులు, స్థానికులు షాక్ అయ్యారు.

తిరుగబోతు కొడుకు
కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని సిద్దాపుర తాలుకాలోని దోడ్డన గ్రామంలో నారాయణ హస్లర్, పార్వతి (43) దంపతులు నివాసం ఉంటున్నారు. నారాయణ, పార్వతి దంపతులకు మంజునాథ్ (24) అనే కుమారుడు, రమ్యా (19) అనే కుమార్తె ఉన్నారు. చదువు పూర్తి చేసుకున్న మంజునాథ్ గాలికి తిరుగుతున్నాడు.

తండ్రి డబ్బుతో కొడుకు జల్సాలు
తండ్రి నారాయణకు పొలాలు, ఎక్కువగా వక్కల తోటలు ఉన్నాయి. తండ్రి నారాయణ సంపాధిస్తుంటే డబ్బుతో అతని కొడుకు మంజునాథ్ జల్సా చేస్తున్నాడు. ఉద్యోగం చెయ్యాల్సిన వయసులో జులాయిగా స్నేహితులతో తిరుగుతూ జల్సా చేస్తున్న మంజునాథ్ మద్యం సేవించడానికి బానిస అయ్యాడు.

పీకలదాక తాగేసి రచ్చరచ్చ చేస్తున్న కొడుకు
మంజునాథ్ ప్రతిరోజూ పీకలదాక మద్యం సేవించి ఇంటికి రావడం, తండ్రి నారాయణ ఇంట్లో ఉంటే సైలెంట్ గా నిద్రపోవడం చేస్తున్నాడు. తండ్రి నారాయణ ఇంట్లో లేకపోతే రెచ్చిపోతున్న యువకుడు అతని తల్లి పార్వతి, అతని చెల్లి రమ్యా మీద ప్రతాపం చూపించడం మొదలు పెడుతున్నాడు. రాత్రి పీకలదాక మద్యం సేవించిన మంజునాథ్ ఇంటికి వెళ్లాడు.

సాంబార్ చప్పగా ఉందని రామాయణం
ఇంటికి వెళ్లిన కొడుకు మంజునాథ్ కు అతని తల్లి పార్వతి భోజనం పెట్టింది. రాత్రి సాంబర్ చెయ్యడంతో మంజునాథ్ అది తిన్నాడు. సాంబార్ చప్పగా ఉందని, కూరలు రిచిగా చెయ్యాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, నామాట అంటే లెక్కలేకుండా పోతా ఉందని మంజునాథ్ రెచ్చిపోయాడు. ఆ సమయంలో పార్వతితో ఆమె కొడుకు మంజునాథ్ గొడవపడ్డాడు.

సాంబార్ రుచిగా లేదని తల్లీ, చెల్లిని కాల్చి చంపేశాడు
తరువాత ఇంట్లో తల్లి పార్వతి, చెల్లి రమ్యాతో గొడవ పెట్టుకున్న మంజునాథ్ సహనం కోల్పోయి ఇంట్లో ఉన్న తుపాకి తీసుకుని తల్లీ, చెల్లిని స్పాట్ లో కాల్చి చంపేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నారాయణ ఇంటికి పరుగు తీశారు. ప్రతిరోజూ తనకు చికెన్ కావాలని, కూరలు రుచిగా చెయ్యాలని మంజునాథ్ పదేపదే గొడవ చేసేవాడని, ఇదే విషయంలో సహనం కోల్పోయి తల్లి పార్వతి, అతని చెల్లి రమ్యాను మంజునాథ్ తుపాకితో కాల్చి చంపేశాడని పోలీసు అధికారులు అంటున్నారు.

తండ్రి ఇంట్లో లేని సమయంలో జంట హత్యలు
మంజునాథ్ అతని తల్లి పార్వతి, చెల్లి రమ్యాను హత్య చేసిన సమయంలో తండ్రి నారాయణ ఇంట్లో లేడని, ఆయన పొరుగూరుకి వెళ్లిన సమయంలో ఈ దారణం జరిగిందని పోలీసులు అంటున్నారు. కన్న తల్లి, సొంత చెల్లిని కాలాంతకుడు మంజునాథ్ ఎందుకు హత్య చేశాడు ? అనే అసలు విషయం తెలుకున్న బంధువులు, స్థానికులు షాక్ అయ్యారు.












Click it and Unblock the Notifications