IIT Bombay Student Suicide: ఐఐటీ బాంబే విద్యార్థి సూసైడ్ కు అసలు కారణం ఇదే..? సంచలన విషయాలు బయటకు..
ఐఐటీ బాంబేకు చెందిన పవయూ క్యాంపస్ లో ఐఐటీ విద్యార్థి సాహిల్ వాకడే సూసైడ్ చేసుకున్న ఘటన ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పరీక్షల్లో చీటింగ్ చేసినట్లు సాహిల్ తనకు చెప్పినట్లు ఓ విద్యార్ధిని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. పరీక్షలో కాపీ కొట్టకుండా ఉండాల్సిందని ఈ మేరకు సాహిల్ తమకు కాల్ చేసి పలుమార్లు విచారం వ్యక్తం చేసినట్లు తెలిపింది. ఆ స్టూడెంట్ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.
ఇక ఈ కేసుకు సంబంధించి సాహిల్ స్నేహితులు, ఫ్యాకల్టీ, హాస్టల్ సిబ్బంది సహా 25 మందికి పైగా వ్యక్తుల వాంగ్మూలాలను పోలీసులు రికార్డు చేశారు. ఈమేరకు సాహిల్ పరీక్ష రాసే సమయంలో గదిలో ఉన్న విద్యార్థులు, ఇన్విజిలేటర్లుగా వ్యవహరించిన సిబ్బందితోపాటు అడ్మినిస్ట్రేషన్ విభాగం అధికారుల నుంచి వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది.
అయితే సాహిల్ వాకడే తల్లిదండ్రులు మాత్రం క్యాంపస్ లో సూర్యనారాయణ దూళ్ల అనే ఉపాధ్యాయుడు కులం పేరుతో అవమానించడంతోనే తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు కీలక ఆరోపణలు చేశారు. ఈ మేరకు తమ కుమారుడ్ని సూసైడ్ కు ప్రేరేపించారని తెలిపారు. ఇందుకు తమ వద్ద బలమైన ఆధారాలున్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలో విద్యార్థి పేరెంట్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు ఆ ప్రొఫెసర్ ను ఐఐటీ యాజమాన్యం సెలవులపై పంపించింది. అయితే త్వరలోనే ప్రొఫెసర్ స్టేట్ మెంట్ ను కూడా రికార్డు చేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వాంగ్మూలాలు, సాంకేతిక సాక్ష్యాలను పరిశీలిస్తున్నామని.. ఈ క్రమంలో ప్రొఫెసర్ దూళ్ల సూర్యనారాయణ వాంగ్మూలాన్ని ఇంకా నమోదు చేయాల్సి ఉందన్నారు.
ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో భాగంగా సాహిల్ ఫోన్ రికార్డులను, స్నేహితులతో జరిపిన కాల్స్ ను దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే సాహిల్ మొబైల్ ఫోన్ కు ప్యాట్రన్ లాక్ ఉన్న నేపథ్యంలో ఫోన్ ను అన్ లాకే చేసేందుకు ఫోరెన్సిక్ నిపుణులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు తమ కుమారుడి సూసైడ్ కు న్యాయం చేయాలని కోరుతూ విద్యార్థి తల్లిదండ్రులు ముంబైలోని ఆజాద్ మైదానంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. బాధ్యులైన వారికి శిక్ష పడేంత వరకూ ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందని విద్యార్థి తండ్రి రవీంద్ర వాకోడే స్పష్టం చేశారు.

ఇక ఈనెల 18 న ఐఐటీ బాంబే క్యాంపస్ లో విద్యార్థి సాహిల్ పరీక్ష హాల్ లో ఏఐ వాడుతూ పట్టుబడినట్లు సమాచారం. ఆ తర్వాత హాస్టల్ గదిలోకి వెళ్లి సూసైడ్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ కేసును ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications
