సారీలతో బేజార్
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే ఎట్టకేలకు మాజీ దౌత్యవేత్త లక్ష్మీ మురుడేశ్వర్ పురీకి బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఫలితంగా- చాలా కాలంగా నడుస్తున్న పరువు నష్టం కేసు ముగిసినట్టయింది. 2021 నాటి వివాదానికి తెర పడింది.
స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో పూరీ ఆస్తిని కొనుగోలు చేయడాన్ని ప్రశ్నిస్తూ 2021లో ట్వీట్ పెట్టారు గోఖలే. అది కాస్తా దుమారం రేపింది. గోఖలేను చట్టపర చర్యలు ఎదుర్కొనేలా చేసింది. క్షమాపణ చెప్పాలని ఢిల్లీ హైకోర్టు సైతం ఆదేశించింది. నష్టపరిహారంగా 50 లక్షల జరిమానాతో పాటు, ఇకపై ఎలాంటి పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయకుండా కోర్టు ఆయనను నిషేధించింది.

నిజానికి ప్రతిపక్ష పార్టీలకు ఇది కొత్తేమీ కాదు. రాహుల్ గాంధీ నుండి దిగ్విజయ సింగ్ వరకు, కాంగ్రెస్ నాయకులు పదే పదే ఒకే విధానాన్ని అనుసరిస్తున్నారు. తొలుత ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం, మీడియాను రెచ్చగొట్టడం, ఆపై చట్టపరమైన చర్యలు తీవ్రతరమైన తరువాత క్షమాపణలతో సరిపెట్టుకుంటోన్నారు.
ఆర్ఎస్ఎస్ RSSని చారిత్రక హత్యలలోకి లాగడం, ప్రధానమంత్రిని దూషించడం, సర్జికల్ స్ట్రైక్స్ వంటి జాతీయ భద్రతా కార్యకలాపాలను రాజకీయం చేయడం.. వంటివి దీనికి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. కీలకాంశాల పట్ల నిర్లక్ష్యంగా చేసిన వాదనల తర్వాత తరచుగా కోర్టుకు క్షమాపణలు చెబుతూ వస్తోన్నారు.
మహాత్మా గాంధీ హత్యకు ఆర్‌ఎస్‌ఎస్ కారణమని రాహుల్ గాంధీ 2014లో చేసిన ప్రకటన కూడా ఈ జాబితాకు చెందినదే. పరువు నష్టం కేసు సుప్రీంకోర్టుకు చేరిన తర్వాత రాహుల్ గాంధీ యూటర్న్ తీసుకున్నారు. తన వ్యాఖ్యలు ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధం ఉన్న వ్యక్తులను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నాయని, ఆ సంస్థను కాదని ఆయన వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
ఆ తరువాత ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. 2016లో రాహుల్ గాంధీ ప్రధాని మోదీని ఉద్దేశించి ఖూన్ కి దలాలీ అని ఆరోపించారు. సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్స్‌ను రాజకీయం చేస్తున్నారని ఆరోపించినప్పుడు కూడా ఇదే తరహా వ్యవహారం పునరావృతం అయింది. ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో రాహుల్ గాంధీ వివరణ ఇవ్వవలసి వచ్చింది.
2019లో రాఫెల్ ఒప్పంద వివాదం సమయంలో కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. చౌకీదార్ చోర్ హై నినాదాన్ని వినిపించారు. ప్రధానమంత్రిపై అవినీతి ఆరోపణలను సుప్రీంకోర్టు కూడా ఆమోదించిందని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. సుప్రీంకోర్టు నేరపూరిత ధిక్కార నోటీసు జారీ చేయడంతో ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పారు
ఇది- రాహుల్ గాంధీ దగ్గరే ఆగట్లేదు. మణిశంకర్ అయ్యర్, జైరామ్ రమేష్, సంజయ్ సింగ్, దిగ్విజయ సింగ్ వంటి కాంగ్రెస్ దిగ్గజాలు పరువు నష్టం కలిగించే లేదా నిరాధారమైన ప్రకటనలు చేసిన తర్వాత క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. దీనికి మరో ఉదాహరణ మణిశంకర్ అయ్యర్ ఉదంతం.
2017లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నీచ్ కిసామ్ కా ఆద్మీ అని అభివర్ణించారు అయ్యర్. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో కాంగ్రెస్ పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది. క్షమాపణలు సైతం చెప్పింది. ఆ తరువాత అయ్యర్.. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు గానీ నష్టం ఇప్పటికే జరిగిపోయింది.
అదేవిధంగా, 2019లో జైరామ్ రమేష్ సైతం ఇలాంటి వ్యాఖ్యలు చేసి చేతులు కాల్చుకున్నారు. మీడియా వచ్చిన ఓ కథనం ఆధారంగా జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ కుమారుడు వివేక్ దోవల్ పై ఆర్థిక అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు చేశారు జైరామ్ రమేష్. పరువు నష్టం దావాను ఎదుర్కొన్నారు. చివరికి లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పారాయన.
2017లో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కపిల్ మిశ్రాపై జరిగిన దాడిలో సంజయ్ సింగ్.. బీజేపీకి చెందిన అంకిత్ భరద్వాజ్‌ను ఇరికించారు. ఆ ఆరోపణ తరువాత నిరాధారమైనదిగా నిరూపితమైంది. దీనితో సంజయ్ సింగ్ తన తప్పును అంగీకరించాల్సి వచ్చింది. బహిరంగంగా క్షమాపణ చెప్పారు.
సీనియర్ నాయకుడు దిగ్విజయ సింగ్ కూడా ఈ ధోరణికి అతీతుడు కాదు. 2023లో ఆయన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ఎంఎస్ గోల్వాల్కర్ గురించి పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను పోస్ట్ చేశారు. ఇది చట్టపరమైన చర్యలకు దారితీసింది. 2024లో కోర్టు ఆయనను లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పమని ఆదేశించింది.
ఆధారాలు లేకుండా రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం, రాజకీయ మైలేజ్ కోసం కథనాలు సృష్టించడం ఆ తరువాత నాలిక్కరచుకోవడం కాంగ్రెస్ కు అలవాటుగా మారిందనే విమర్శలు ఉన్నాయి. ప్రజల నుంచి ఆగ్రహావేశాలు, కోర్టుల నుంచి మొట్టికాయలు తిన్న తరువాతే వాటిని ఉపసంహరించుకుంటోంది.
-
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications