Satanic Verses:36ఏళ్ల తర్వాత మళ్లీ బుక్ షాపుల్లో వివాదాస్పద నవల-గతంలో రాజీవ్ బ్యాన్ ..!

యష్ నటించిన కేజీఎఫ్ 1 చిత్రం ప్రారంభంలో ఓ జర్నలిస్టు తాను రాసిన ఓ పుస్తకాన్ని తీసుకుని ఓ టీవీ స్టూడియోకి వెళ్తాడు. ఆ పుస్తకాన్ని గతంలో ప్రభుత్వం నిషేధించిందని, దాని కాపీలు ఎక్కడా కనిపించకుండా తగులబెట్టించిందని, తన దగ్గర మిగిలిపోయిన ఓ కాపీ తెచ్చానని యాంకర్ తో చెప్తాడు. అంతలా ఆ పుస్తకంలో ఏముందనేది చిత్రంలో చూపిస్తారు. అలాగే 36 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం సరిగ్గా ఈ కేజీఎఫ్ ఛాప్టర్ 1 నవల తరహాలోనే నిషేధించిన ఓ పుస్తకం తిరిగి ప్రత్యక్షమైంది.

ప్రముఖ నవలా రచయిత సల్మాన్ రష్దీ రచించిన వివాదాస్పద పుస్తకం సాటానిక్ వెర్సెస్‌ ను తిరిగి మార్కెట్లోకి విడుదల చేసేందుకు ఢిల్లీ హైకోర్టు తాజాగా అనుమతి ఇచ్చింది. 1988లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఈ పుస్తకంలోని కొన్ని భాగాలను దైవదూషణగా పరిగణించి దానిని నిషేధించింది. షా బానో కేసు తర్వాత రాజీవ్ గాంధీ ప్రభుత్వం దీని అమ్మకాలను అడ్డుకోవడంతో పాటు అనధికారికంగా నిషేధం విధించింది. కానీ అప్పట్లో తాము నిషేధం విధించలేదని, దిగుమతులకు బ్రేక్ వేసినట్లు రాజీవ్ సర్కార్ చెప్పుకుంది.

Salman Rushdie s The Satanic Verses Returns to sales after 36 years of ban by Rajiv Gandhi

విదేశాల్లో ఉండి సల్మాన్ రష్డీ రాసిన ఈ పుస్తకంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్ లోని పలు అంశాల్ని ప్రశ్నిస్తూ సల్మాన్ రష్టీ రాసిన ఈ నవలపై ఇరాన్ సహా పలు ముస్లిం దేశాలు విరుచుకుపడ్డాయి. ఈ నవల రచయిత సల్మాన్ రష్టీని చంపాలని ఫత్వాలు కూడా ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ వివాదాస్పద పుస్తకం దిగుమతుల్ని కేంద్రం నిలిపేసింది. దాన్నే నిషేధంగా విపక్షాలు పేర్కొన్నాయి. ఇప్పుడు రాజ్యాంగంపై, జమిలి ఎన్నికపై పార్లమెంట్లో చర్చ నేపథ్యంలో తిరిగి కేంద్రం ఈ పుస్తకాన్ని తెరపైకి తెచ్చి కాంగ్రెస్ ను ఇరుకునపెట్టేందుకు చూస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+