నెక్స్ట్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ఆ ముఖ్యమంత్రే- డిప్యూటీ సీఎంతో కలిసి ఢిల్లీ రాక
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో దేశ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నీట్ పేపర్ల లీక్, అనంతరం కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఉద్యమం నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దీనికి గల కారణాలను వివరిస్తూ రెండు పేజీల సుదీర్ఘ లేఖను విడుదల చేశారు. ఆయన రాజీనామా ఆమోదం పొందింది కూడా.
ఈ పరిణామాల మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెరమీదికి వచ్చారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన వెంటనే ఆయనకు ఢిల్లీ నుంచి పిలుపు అందింది. మరుక్షణమే ఆయన ముంబై నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. కొద్దిసేపటి కిందటే దేశ రాజధానిలో అడుగు పెట్టారు. ఆయన వెంట.. ఉప ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఉన్నారు. ఈ ఉదంతం.. అటు ఢిల్లీ, ఇటు మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది.

అదే సమయంలో శివసేన (యూబీటీ) సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవేంద్ర ఫడ్నవిస్ త్వరలోనే కేంద్ర క్యాబినెట్ లోకి చేరబోతున్నారని అన్నారు. ఆయనకు కేంద్ర విద్యాశాఖ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీనికోసమే ఫడ్నవీస్‌ను తక్షణమే ఢిల్లీకి రావాల్సిందిగా భారతీయ జనతా పార్టీ అధిష్టానం నుంచి పిలుపు అందిందని ఆయన స్పష్టం చేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా దేవేంద్ర ఫడ్నవిస్.. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తేల్చి చెప్పారు.
Mumbai, Maharashtra: Shiv Sena (UBT) MP Sanjay Raut says, "I think Devendra Fadnavis may replace Dharmendra Pradhan." pic.twitter.com/UIZmKEyGpe
— IANS (@ians_india) July 25, 2026
అదే సమయంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ అనుసరిస్తున్న వైఖరిని సంజయ్ రౌత్ తప్పుపట్టారు. కంటితుడుపు చర్యగా విద్యార్థులతో చర్చలు జరపాలని హితవు పలికారని విమర్శించారు. తాను స్వయంగా నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను గురించి డిమాండ్ చేయాల్సిందని అన్నారు. ఆ పని చేయనందున ఆయనకు నాగ్‌పూర్‌కు వచ్చే అధికారంలో లేదని అన్నారు.
దేవేంద్ర ఫడ్నవీస్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలను స్వీకరించాల్సి వస్తే.. అది మహారాష్ట్ర రాజకీయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలు సైతం అనూహ్యంగా మారవచ్చు. ఆయన వారసుడిని ఎంపిక చేసే బాధ్యత బీజేపీ హైకమాండ్ పై పడుతుంది. పడ్నవిస్ కు సరితూగే నేతను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications