శశికళకు ఝలక్: పార్టీని వీడి కరుణానిధి వైపు వెళ్తున్నారు!
అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు శశికళ చేతుల్లోకి వెళ్లేందుకు రంగం సిద్ధమవుతున్న దశలో ఆమెకు షాక్ తగులుతోంది.
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు శశికళ చేతుల్లోకి వెళ్లేందుకు రంగం సిద్ధమవుతున్న దశలో ఆమెకు షాక్ తగులుతోంది. పార్టీని శశికళ లీడ్ చేస్తారనే వార్తల నేపథ్యంలో పలువురు అన్నాడీఎంకే కార్యకర్తలు, నాయకులు ప్రతిపక్ష డిఎంకేలో చేరుతున్నారు.
శశికళకు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం సహా పలువురు నుంచి మద్దతు ఉంది. అయితే జయలలిత కోడలు దీపా జయకుమార్, పార్టీ నుంచి బహిష్కరణకు గురైన శశికళ పుష్పలతో పాటు పలువురి నుంచి వ్యతిరేకత వస్తోంది.

ముఖ్యంగా పార్టీ క్యాడర్ కూడా శశికళ పార్టీ పగ్గాలు చేపట్టడంపై తీవ్ర అసంతృప్తితో ఉందని తెలుస్తోంది. ఈ కారణంగానే పలువురు డిఎంకే వైపు వెళ్తున్నారని అంటున్నారు.
రెండు రోజుల క్రితం బహిష్కరణకు గురైన శశికళ పుష్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆసుపత్రిలో జయలలితకు ఎలాంటి చికిత్స అందించారనే విషయం కూడా ఎవరికీ తెలియదని, అత్యంత గోప్యతను పాటించారని మండిపడ్డారు. జయ మరణం వెనుక కుట్ర ఉందన్నారు.
జయలలిత మరణం పైన పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ నటి గౌతమి పలు అనుమానాలతో ఏకంగా ప్రధాని మోడీకే లేఖ రాశారు. జయ మేనకోడలు దీప కూడా పలు ఆరోపణలు చేశారు.












Click it and Unblock the Notifications