పోయెస్ మాదే! కోర్టుకెళ్తాం: పన్నీరుకు శశికళ వర్గం హెచ్చరిక
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం అన్నాడీఎంకే అధినేత్రి శశికళ కంటే పార్టీ పైన, ప్రభుత్వం పైన పట్టు సాధిస్తున్నారు. అలా ఆయన పావులు కదుపుతున్నారు.
చెన్నై: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం అన్నాడీఎంకే అధినేత్రి శశికళ కంటే పార్టీ పైన, ప్రభుత్వం పైన పట్టు సాధిస్తున్నారు. అలా ఆయన పావులు కదుపుతున్నారు. మొత్తానికి గతంలో తన వైఖరి కంటే భిన్నంగా దూకుడుగా వెళ్తున్నారు.
పోయెస్ గార్డెన్‌ను అమ్మ స్మారక మందిరంగా మారుస్తాననని ప్రకటించారు. ఈనేపథ్యంలో శశికళ వర్గం కూడా అంతే ధీటుగా స్పందించింది
పోయెస్ గార్డెన్ ప్రభుత్వ ఆస్తి కాదని, ప్రయివేటు ఆస్తి అని శశికళ వర్గం చెప్పింది. ఇల్లు శికళ వదిన ఇళవరసి కుమారుడు వివేక్ పేరు పైన ఉందని తేల్చి చెప్పారు. పోయెస్ గార్డెన్ స్వాధీనం చేసుకుంటే ఊరుకోమని, కోర్టుకు వెళ్తామని చెప్పారు. అంతేకాదు, శశికళ వర్గీయులు పోయెస్ గార్డెన్ ఎదుట పన్నీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు.

పన్నీరు సెల్వం వర్గం కూడా పోయెస్ గార్డెన్ పైన అంతే ధీటుగా స్పందించింది. శశికళ వర్గం చెప్పేదంతా అబద్దమని చెప్పింది.
విమానం ఎక్కిన విద్యాసాగర రావు
తమిళనాడు ఇంచార్జి గవర్నర్ విద్యాసాగర రావు మధ్యాహ్నం చెన్నై విమానం ఎక్కారు. ఆయన మధ్యాహ్నం మూడుంపావుకు తమిళనాడు రాజధానిలో దిగనున్నారు. ఆయనను కలిసేందుకు ఇటు శశికళ వర్గీయులు, అటు పన్నీరు వర్గీయులతో పాటు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి.












Click it and Unblock the Notifications