వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శశికళకు చివరి చాన్స్: పన్నీర్ కు చెక్ పెట్టాలంటే ఇది ఒక్కటే మార్గం !

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని ఆశపడుతున్న చిన్నమ్మ శశికళకు అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. శశికళ సీఎం కాకుండా చూడటానికి అన్ని వర్గాలు ఏకతాటి పైకి రావడంతో మన్నార్ గుడి గ్యాంగ్ హడలిపోతుంది.

శశికళ తాను సీఎం కావాలని పన్నీర్ సెల్వంతో బలవంతంగా రాజీనామా చేయించారని తమిళనాడు ప్రజలు నమ్ముతున్నారు. మంగళవారం రాత్రి మెరీనా బీచ్ లోని జయలలిత సమాధి దగ్గర స్వయంగా పన్నీర్ సెల్వం తనతో బలవంతంగా రాజీనామా చేయించారని బాంబు పేల్చారు.

<strong>రాజీకి వచ్చిన శశికళ: పన్నీర్ సెల్వం ఇంటికి పరుగు తీసి వెళ్లి !</strong>రాజీకి వచ్చిన శశికళ: పన్నీర్ సెల్వం ఇంటికి పరుగు తీసి వెళ్లి !

సీఎం పదవి మీద ఆశపడిన శశికళ మీద ఇప్పుడు అందరూ దుమ్మెత్తి పోస్తున్నారు. కేవలం సీఎం కుర్చికోసం శశికళ తమిళనాడుకు ఈ పరిస్థితులు తీసుకోచ్చారని మండిపడుతున్నారు. అయితే జయలలిత ఆక్రమాస్తుల కేసులో ఎ2 ముద్దాయిగా ఉన్న శశికళకు ఇప్పుడు ఒకే ఒక మార్గం ఉంది.

Sasikala's supporters have demanded that she be sworn in as Chief Minister immediately.

తనకు అత్యంత నమ్మకస్థుడైన వ్యక్తిని సీఎం చెయ్యాలి. ఈ విషయం గవర్నర్ విద్యాసాగర్ రావు ముందు చెప్పాలి. అదే సమయంలో తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల జాబితా ఇవ్వాలి. అయితే ఈ పని చెయ్యడానికి శశికళ సామాన్యంగా ఒప్పుకోరని అన్నాడీఎంకే నాయకులే అంటున్నారు.

<strong>శశికళకు షాక్: మెరీనా బీచ్ సాక్షిగా మరో పోరాటం: యువత వార్నింగ్ !</strong>శశికళకు షాక్: మెరీనా బీచ్ సాక్షిగా మరో పోరాటం: యువత వార్నింగ్ !

గురువారం సాయంత్రం చెన్నైలో గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసిన తరువాత రాజ్ భవన్ ఎదుట పన్నీర్ సెల్వం మీడియాతో మాట్లాడుతూ ఎప్పటికైనా న్యాయం, ధర్మం జయిస్తోందని మీడియాకు చెప్పి బాంబు పేల్చారు. పన్నీర్ సెల్వం ముఖంలో చిరునవ్వు కనపడటంతో శశికళ వర్గం ఆందోళన చెందుతోంది.

అయితే గురువారం రాత్రి 7.30 గంటలకు శశికళ వర్గం గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావును కలిసిన తరువాత చిన్నమ్మను సీఎం చేస్తారా ? వేరే వారికి చాన్స్ ఇస్తారా అనే విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.

English summary
VK Sasikala Natarajan's supporters have demanded that she be sworn in as Chief Minister immediately. Ms Sasikala will present to the Governor support letters from 130 legislators.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X