జయ మృతిపై నోరు తెరిచిన శశికళ: ఏమన్నారు?

జయలలిత మృతిపై వ్యక్తమవుతున్న అనుమానాలపై శశికళ తొలిసారి పెదవి విప్పారు. పన్నీర్ సెల్వం ప్రకటనపై కూడా ఆమె స్పందించారు.

చెన్నై: దివంగత నేత జయలలిత మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో చిన్నమ్మ శశికళ ఎట్టకేలకు నోరు తెరిచారు. తొలిసారి ఆమె జయలలిత మృతిపై వ్యక్తమవుతున్న సందేహాలకు సమాధానం ఇచ్చారు. సిఎన్ఎన్ - న్యూస్ 18 చానెల్‌తో ఆమె ఆ విషయంపై మాట్లాడారు.

అమ్మతో కలిసి తనాను 33 ఏళ్లు ఒకే ఇంట్లో ఉన్నానని, ఆమెను తాను ఎంత బాగా చూసుకున్నానో బాడీగార్డులకు తెలుసునని, జయ మృతిపై కావాలనే వందతులు వస్తున్నారని, ఎవరో వీటిని సృష్టిస్తున్నారని శశికళ అన్నారు. అమ్మ ఆస్పత్రిలో ఉన్న 75 రోజులు కూడా తాను ఆమెతో ఉండి జాగ్రత్తగా చూసుకున్నట్లు తెలిపారు. వైద్యులే దానికి సాక్షులని చెప్పారు.

Sasikala speaks about Jayalalithaa's death

ఆ విషయాన్ని తాను అంతరాత్మ సాక్షిగా చెబుతున్నానని, అమ్మ మరణం తర్వాత తాను చాలా బాధనూ ఆవేదనను అనుభవించానని అన్నారు. జయలలిత మృతిపై అనుమానాలను నివృత్తి చేసేందుకు విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామనే పన్నీర్ సెల్వం వ్యాఖ్యలపై కూడా శశికళ స్పందించారు.

పన్నీర్ సెల్వం ప్రకటన తనను చాలా బాధించిందని, తమకు ఏ విధమైన భయమూ లేదని, తాము ఎయిమ్స్ నుంచీ లండన్ నుంచీ సింగపూర్ నుంచీ వైద్యులను పిలిపించామని చెప్పారు. తాను తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి తీరుతానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. డిఎంకె ప్రమేయం వల్లనే తమిళనాడులో సంక్షోభం తలెత్తిందని ఆమె విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+