గవర్నర్ ఏం చేస్తారు?: శశికళకే ఎక్కువ ఛాన్స్, పన్నీరు వైపు వారి మొగ్గు
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తనకు ఎమ్మెల్యేల మద్దతు ఉందంటే, తనకు ఉందని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, అన్నాడీఎంకే తాత్కాలిక చీఫ్ శశికళలు ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావుకు విజ్ఞప్తులు చేశారు.
చెన్నై: ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తనకు ఎమ్మెల్యేల మద్దతు ఉందంటే, తనకు ఉందని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, అన్నాడీఎంకే తాత్కాలిక చీఫ్ శశికళలు ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావుకు విజ్ఞప్తులు చేశారు.
దీంతో ఇప్పుడు గవర్నర్ ఏం చేస్తారు? అటార్నీ జనరల్ నిర్ణయం ఏమిటి? నిబంధనలు ఎవరికి అనుగుణంగా ఉన్నాయి? గవర్నర్ ముందు ఉన్న ఆప్షన్లు ఏమిటి.. ఆయన ఎలా ముందుకు వెళ్తారనే చర్చ జరుగుతోంది.
పరిస్థితులు చూస్తుంటే శశికళకే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తోంది. కొందరు ఎమ్మెల్యేలు శశికళ క్యాంపు నుంచి శశికళ వైపు మొగ్గు చూపారు. అయితే, మెజార్టీ మాత్రం శశికళ వెంటనే ఉందని అంటున్నారు.

కొందరు తక్కువ అయినప్పటికీ.. శశికళకు సీఎం పీఠం ఛాన్స్ ఉందని తెలిస్తే వారు తిరిగి పన్నీరు క్యాంప్ నుంచి శశికళ వైపు వస్తారని అంటున్నారు. ఇప్పటికే ఆమె తాను ముఖ్యమంత్రి పీఠం ఎక్కేందుకు కావాల్సిన ఎమ్మెల్యేల సంతకాలు సేకరించారు. దీనినే ఆమె గవర్నర్ ముందు ఉంచారు. దీంతో ఇప్పుడు శశికళకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
అయితే, శశికళకు సొంత పార్టీలో ఎక్కువ వ్యతిరేకత, రాష్ట్రంలో వ్యతిరేకత ఉంది. విపక్షాలు కూడా పన్నీరుకు మద్దతిస్తున్నాయి. పైగా జయలలిత అక్రమాస్తుల కేసులో నిందితురాలు. ఈ కేసులో సుప్రీం కోర్టు శుక్రవారం తీర్పు చెప్పనుంది. ఇది కూడా ఆమెకు అఢ్డంకి అవుతోంది. అయితే, కేసులు తదితరాలను చూపించి. ఎమ్మెల్యేల బలం ఉన్న శశికళను పక్కన పెట్టడం సరికాదంటున్నారు.
మరోవైపు, ఓ ఆన్‌లైన్ సర్వేలో 95శాతం మంది పన్నీర్ సెల్వంకే మద్దతు తెలిపారు. తమిళనాడుకు నాయకత్వం వహించేందుకు గౌరవ ముఖ్యమంత్రి తన పదవిలో కొనసాగాలా? అన్న ప్రశ్నపై 95శాతం మంది నెటిజన్లు పన్నీర్‌కే తమ ఓటు వేశారు.
సీఎంవో తమిళనాడు.. పర్యవేక్షిస్తున్న ఓ పన్నీర్ సెల్వం ట్విటర్ ఖాతా వేదికగా ఈ సర్వేను చేపట్టారు. సుమారు 52వేలమంది ఈ సర్వేలో పాల్గొని తమ అభిప్రాయాన్ని తెలిపారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications