" సంతకాలన్నీ ఫోర్జరీ, మానసిక ఒత్తిడిలో ఎంఏల్ఏలు,గవర్నర్ కిలా పన్నీర్"
శశికళ ఎంఏల్ఏ ఫోర్జరీ సంతకాలను సేకరించారని తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం గవర్నర్ విద్యాసాగర్ రావుకు ఫిర్యాదు చేశారు.శశికళ ఎంఏల్ఏలను ఏ రకంగా నిర్బంధించారో ఆయన గవర్నర్ కు ఫిర్యాదు చేశారు
చెన్నై:అన్నాడిఎంకె పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ గవర్నర్ కు ఇచ్చిన ఎంఏల్ఏల మద్దతు లేఖలన్నీ పోర్జరీ లేఖలేనని తమిళనాడు అపద్దర్మముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం గవర్నర్ విద్యాసాగర్ రావుకు వివరించారు.
గురువారం సాయంత్రం రాజ్ భవన్ లో అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం గవర్నర్ విద్యాసాగర్ రావుతో సుమారు అరగంటపాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎంఏల్ఏల సంతకాలు ఫోర్జరీ సంతకాలని పన్నీర్ సెల్వం గవర్నర్ కు వివరించారు.

శశికళ శిబిరంలో ఉంటూ పన్నీర్ సెల్వం గ్రూప్ లోకి వచ్చిన షణ్ముగనాథన్ అనే ఎంఏల్ఏ గవర్నర్ విద్యాసాగర్ రావుకు ఏ రకంగా ఎంఏల్ఏల సంతకాలను తీసుకొన్నారో వివరించారు.
వ్యూహత్మకంగానే పన్నీర్ సెల్వం తన వెంట షణ్ముగనాథన్ అనే ఎంఏల్ఏను తీసుకెళ్ళాడు. శిబిరంలో ఎంఏల్ఏలను ఏ రకంగా నిర్భంధించారో సెల్వం వివరించారు.
శశికళకు మద్దతిస్తోన్న ఎంఏల్ఏ సంతకాలన్నీ ఫోర్జరీ సంతకాలే అని పన్నీర్ గవర్నర్ కు వివరించారు. ఎంఏల్ఏలంతా మానసిక ఒత్తిడిలో ఉన్నారని ఆయన చెప్పారు. ఈ మేరకు అసెంబ్లీలో తనకు బలనిరూపణకు అవకాశమివ్వాలని ఆయన గవర్నర్ ను కోరారు.












Click it and Unblock the Notifications