దటీజ్ శశికళ! మోడీకి లేఖలోనూ వ్యూహం: అందరినీ ఆశ్చర్యపరిచారు

శశికళ కేంద్రం పైన రాజకీయ చతురత ప్రదర్శించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి తాను పెట్టుకున్న ముహూర్తానికి కేంద్రం పరోక్షంగా ఆటంకాలు కలిగించినట్లుగా ప్రచారం జరిగింది.

చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ కేంద్రం పైన రాజకీయ చతురత ప్రదర్శించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి తాను పెట్టుకున్న ముహూర్తానికి కేంద్రం పరోక్షంగా ఆటంకాలు కలిగించినట్లుగా ప్రచారం జరిగింది.

దీనిపై ఆమె ఆత్మస్థైర్యం కోల్పోలేదు. పైగా ఆమె నేరుగా ప్రధాని నరేంద్ర మోడీకి ఈ అంశంపై లేఖ సంధించడం చర్చనీయాంశమైంది. రాజకీయాలకు సంబంధం లేని అంశం మీద ఆమె లేఖ రాయడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.

Sasikala writes letter to PM Modi

శ్రీలంక అదుపులోకి తీసుకున్న 35 మంది తమిళ మత్స్యకారులు, 120 పడవలను వెంటనే విడిపించేందుకు ప్రధాని జోక్యం చేసుకోవాలని ఆమె లేఖ రాశారు. తమిళ రాజకీయం తన చుట్టూ తిరిగుతుండగా శశికళ మాత్రం అందుకు భిన్నంగా స్పందించడం గమనార్హం.

జల్లికట్టు నిషేధం ఎత్తివేయాలని కోరుతూ గతంలో ఆమె ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఇప్పుడు ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండా ప్రతిపక్షాలు, పార్టీలోని ఆమె అసమ్మతి వర్గాలు, దీపా జయకుమార్ వంటి వారు ప్రయత్నిస్తున్నారు. కానీ శశికళ మాత్రం తనదైన శైలిలో పావులు కదుపుతూ ముందుకు పోతున్నారు.

అయితే, అంతకుముందు ఆమె తన ప్రమాణ స్వీకార జాప్యం విషయమై ప్రధాని మోడీకి లేఖ రాసినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ రోజు ఉదయం శశికళపై ఆ పార్టీ నేత పాండ్యన్‌ పలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ లేఖ విషయం బయటకు రావడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+