హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గంటసేపు సత్య నాదేళ్ల ప్రసంగం, కలవాలని బాబు ఆసక్తి

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సరికొత్త సాంకేతికత విజ్ఞాన ఆధారిత పరికరాలను కనుగొనడంలో భాగస్వాములు కావాలని మైక్రోసాఫ్ట్ ఇండియా పరిశోధన అభివృద్ధి కేంద్రం ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల పిలుపునిచ్చారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ వచ్చిన ఆయన సోమవారం ఉదయం గచ్చిబౌలిలోని మైక్రోసాఫ్ట్ ఇండియా పరిశోధన - అభివృద్ధి కేంద్రాన్ని సందర్శించారు.

వివిధ రంగాలలో ఉత్పాదనకతను మరింత పెంపొందించేందుకు అనువైన కొత్త విధానాలు, ఉపకరణాల (ప్రాసెస్ అండ్ టూల్స్)కు భవిష్యత్తులో విశేషమైన గిరాకీ లభించగలదని సత్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు. అటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించడంపై దృష్టి పెట్టాలని సిబ్బందికి సూచించారు. సిబ్బందిని ఉద్దేశించి ఆయన గంటపాటు ఉత్తేజిత ప్రసంగం చేశారు.

ఆయన ప్రసంగంలో ఆయనకు ఇష్టమైన మొబైల్ ఫస్ట్, క్లౌడ్ ఫస్ట్ అంశాలు ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. భవిష్యత్తులో ఎదురయ్య అవకాశాలు, సవాళ్లను ఇప్పటి నుండే సిబ్బందికి ఆయన పిలుపునిచ్చారు. మైక్రోసాఫ్ట్ ప్రయాణంలో భారత్‌కు విశిష్టమైన స్థానం ఉందని చెప్పారని తెలుస్తోంది.

Satya Nadella in Microsoft office on Monday

మన దేశంలో మైక్రోసాఫ్ట్‌కు 9 కార్యాలయాలు ఉన్నాయని, వీటిల్లో పని చేస్తున్న దాదాపు ఆరున్నరవేల మందిలో అత్యధికులు ఈ ప్రసంగాన్న లైవ్ వెబ్ కాస్ట్ ద్వారా ఆయన ప్రసంగాన్ని విన్నారు. హైదరాబాద్ కార్యాలయంలో దాదాపు రెండున్నరవేల మంది పని చేస్తున్నారు.

కాగా, అమెరికా తిరిగి వెళ్లే ముందు ఆయన మంగళవారం నాడు దేశ రాజధాని న్యూఢిల్లీలో పలు కార్యక్రమాల్లో సత్య నాదెళ్ల పాల్గొంటారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సత్య నాదెళ్లకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. త్వరలోనే ఆయనను కలవాలనే ఆసక్తిని ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఐటి హబ్‌ను నెలకోల్పాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుండటంతో పాటు మైక్రోసాఫ్ట్ సంస్థను విశాఖలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్లను కోరినట్టుగా సమాచారం. ఇరు రాష్ట్రాలూ ఐటి రంగంలో అభివృద్ధికి తన వంతు సాయం చేయమని సత్యనాదెళ్లను కోరినట్టు తెలిసింది. హైదరాబాద్‌కు దూరంగా వైజాగ్‌లో ఐటి హబ్ ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు వెళ్లడంతో కలవలేకపోయినట్టు తెలుస్తోంది.

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సోమవారం హైదరాబాద్‌లోని సంస్థ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్ (ఐడిసి)లోని సహచరులతో భేటీ అయ్యారు. అమెరికా రిచ్‌మండ్‌లో ప్రధాన కేంద్రంలో ఉన్న తరహాలోనే హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ పరిశోధనా కేంద్రం ఉంది.

ఐడిసిలోని అన్ని విభాగాలను సత్య నాదెళ్ల సందర్శించి, సహచరులతో ముచ్చటించారని అనంతరం ఆయన కీలకమైన హెచ్‌ఆర్ ప్రతినిధులతో అంతర్గత సమావేశంలో పాల్గొన్నారని తెలుస్తోంది. ఫిబ్రవరిలో సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సత్య నాదెళ్ల భారత్ వచ్చారు. సత్య పర్యటనను గోప్యంగా మైక్రోసాఫ్ట్ గోప్యంగా ఉంచింది.

English summary
Satya Nadella in Microsoft office on Monday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X