సత్యం స్కాంపై ఛార్జీషీట్: రామలింగ రాజు సహా 47మంది

సత్యం కుంభకోణంపై ఈడి 2009లో కేసు నమోదు చేసింది సిబిఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసును నమోదు చేసింది. ఇప్పుడు దర్యాఫ్తును పూర్తి చేసింది. సత్యం దివాళాపై పూర్తి స్థాయి విచారణను జరిపిన ఈడి ఛార్జీషీట్ దాఖలు చేసింది. రామలింగ రాజు, రామరాజు సహా పలువురు వ్యక్తులు, సంస్థల పేర్లను పేర్కొంది.
కాగా, సత్యం కుంభకోణానికి సంబంధించి కేసులో సత్యం కంపెనీకి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో పోయిన ఏడాది డిసెంబర్‌లో ఊరట లభించిన విషయం తెలిసిందే. కంపెనీ ఆస్తుల జఫ్తునకు సంబంధించి ఈడి ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు అప్పుడు స్టే విధించింది.
సత్యం కేసులో ఈడి రూ.822 కోట్ల విలువైన ఆస్తులను నాడు జఫ్తు చేసింది. దీనిని సవాల్ చేస్తూ సత్యం కంప్యూటర్స్ మాజీ చైర్మన్ రామలింగ రాజు హైకోర్టును ఆశ్రయించారు. ఇరువైపుల వాదనల అనంతరం హైకోర్టు ఈడి ఆదేశాలను నిలుపుదల చేసింది.












Click it and Unblock the Notifications