Delhi Cabinet : ఢిల్లీ కేబినెట్లో మార్పులు-సిసోడియా, జైన్ స్దానాల్లో సౌరభ్ భరద్వాజ్, అతిషి..
ఢిల్లీ మంత్రివర్గంలో ఇద్దరు మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ అరెస్టుల నేపథ్యంలో వారు తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు.
ఢిల్లీలో చోటు చేసుకున్న లిక్కర్ స్కాంలో సీబీఐ తాజాగా డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్టు చేసింది. అంతకు ముందే ఆరోగ్యమంత్రి సత్యేందర్ జైన్ ను మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసింది. దీంతో వీరిద్దరు నిన్న మంత్రి పదవులకు తమ రాజీనామాలు సమర్పించారు. ఈ నేపథ్యంలో కేబినెట్ లో రెండు మంత్రి పదవులు భర్తీ చేసేందుకు అరవింద్ కేజ్రివాల్ సిద్దమయ్యారు.
ఢిల్లీ కేబినెట్లో మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ రాజీనామాలతో ఏర్పడిన ఖాళీల్ని ఆప్ ఎమ్మెల్యేలు సౌరభ్ భరద్వాజ్, అతిషితో భర్తీ చేసేందుకు సీఎం అరవింద్ కేజ్రివాల్ నిర్ణయించారు. ఇందులో ఉన్నత విద్యావంతురాలైన అతిషికి విద్య, కార్మిక, పర్యాటకం వంటి కీలక శాఖలను ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే సౌరభ్ భరద్వాజ్‌కు పిడబ్ల్యుడి, విద్యుత్, హోం శాఖలను కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు వీరిద్దరి పేర్లను ముఖ్యమంత్రి కేజ్రివాల్.. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు పంపారు. ఆయన నిబంధనల ప్రకారం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నారు.

మనీష్ సిసోడియా రాజీనామా నేపథ్యంలో సీఎం కేజ్రివాల్ కొత్త మంత్రులను నియమించే వరకు మంత్రి కైలాష్ గెహ్లాట్ కు ఫైనాన్స్, పిడబ్ల్యుడి, హోమ్, పవర్, ప్లానింగ్, అర్బన్ డెవలప్‌మెంట్, ఇరిగేషన్, వరద నియంత్రణ, నీటి శాఖలను సీనియర్ మంత్రి కైలాష్ గహ్లాట్ కు కేటాయించారు. అలాగే ఆయనకు ఆర్థిక, ప్రణాళిక శాఖల్ని కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సిసోడియా స్ధానంలో గెహ్లాట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. చాలా కాలంగా మంత్రివర్గంలో ఉన్న కైలాష్ గెహ్లాట్ ప్రస్తుతం రెవెన్యూ శాఖ చూస్తున్నారు.












Click it and Unblock the Notifications