వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం: గే వ్యక్తిని జడ్జీగా నియామకం

|
Google Oneindia TeluguNews

భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన నిర్ణయవ తీసుకుంది. గే వ్యక్తిని జడ్జిగా నియమిస్తూ సుప్రీం కోర్టు కొలీజియం డెసిసన్ తీసుకుంది. ఢిల్లీ హైకోర్టు జడ్జిగా సీనియర్ లాయర్‌ సౌరభ్‌ కిర్‌పాల్‌ పేరును కొలీజియం సిఫార్సు చేసింది. జడ్జిగా సౌరభ్‌ కిర్‌పాల్‌ నియామకంపై గత మూడేళ్లుగా కొలీజియం నిర్ణయం తీసుకోలేదు.

సౌరభ్‌ కిర్‌పాల్‌ మాజీ సీజేఐ బీఎన్‌ కిర్‌పాల్‌ కుమారుడు. 2017లో సౌరభ్‌ కిర్‌పాల్‌ పేరును ఢిల్లీ హైకోర్టు సిఫార్సు చేసింది. విదేశీ రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న ఓ వ్యక్తిని సౌరభ్‌ జీవిత భాగస్వామిగా చేసుకున్నారు. దీంతో గేతో సహజీవనం చేస్తున్న కారణంగా సౌరభ్‌ పేరును కేంద్రం పక్కన పెట్టింది. గే హక్కుల కోసం సౌరభ్‌ కిర్‌పాల్‌ సుప్రీంలో పోరాడి విజయం సాధించారు.

 SC collegium recommends elevation of advocate Saurabh Kirpal as Delhi HC judge

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలిజీయం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఈ నెల 11వ తేదీన ఖరారు చేసింది. ఈ మేరకు మీడియాకు తెలియజేసింది. దేశ చరిత్రిలో ఇలా తొలిసారి హైకోర్టుకు గేను జడ్జీగా నియమిస్తూ సెన్సేషనల్ డిసిషన్ తీసుకున్నారు.

English summary
Supreme Court collegium headed by Chief Justice of India N V Ramana has recommended the elevation of senior advocate Saurabh Kirpal as the judge of the Delhi High Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X